Ananya Panday: టాలీవుడ్ పై అనన్య పాండే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇప్పుడు కేవలం రీజినల్ ఇండస్ట్రీ కాదంటూ ఈ బాలీవుడ్ భామ అనన్య పాండే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ సినిమాల్లో కొన్ని హిందీ రాష్ట్రాలకే పరిమితమవుతున్న క్రమంలో తెలుగు సినిమాలు మాత్రం ప్రపంచం మొత్తం ఏలుతున్నాయని ఆమె చెప్పుకొచ్చింది. ఇక పాన్ ఇండియా కింగ్‌లా టాలీవుడ్ మారిందని ఆమె అభిప్రాయపడింది.

Also Read: తన తప్పును ఒప్పుకొంది.. మెగాస్టార్ తల్లిగారు క్షమిస్తారా ?
కాగా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ ‘లైగర్’ సినిమా సినీ జనంతో పాటు సాధారణ జనం కూడా ఈ సినిమా పై ఆసక్తి చూపించారు. అసలు లైగర్ అంటే ఏంటంటే.. మగ సింహానికి – ఆడ పులికి పుట్టిన దాన్నే లైగర్ అంటారు. మరి బలమైన ఈ క్రూర మృగాలా కలయికలో పుట్టిన లైగర్ అంటే.. ప్రపంచంలోనే ఓ ప్రత్యేకత ఉంది.
ఇక హిందీలో ఈ సినిమాకు బాగా మార్కెట్ కావడానికి కారణం.. అనన్య పాండే హీరోయిన్ కావడం, అలాగే బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావడంతో హిందీ ప్రేక్షకులకు ఈ సినిమా డైరెక్ట్ హిందీ సినిమా అనే ఫీలింగ్ ను కలిగించింది. ఇక విజయ్ దేవరకొండను పక్కా బాక్సర్ గా భారీ బిల్డప్ తో పూరి ఈ సినిమాలో చూపించబోతున్నాడు. పైగా ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ కష్టపడి సిక్స్ ప్యాక్ చేశాడు.
Also Read: నమ్రత పై మహేష్ చేసిన ట్వీట్ వైరల్.. ఇక వచ్చే వారం నుంచి గోవాకి !