https://oktelugu.com/

‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’తో వస్తున్న చిన్న దేవరకొండ

అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదులుకొని సినిమాల్లోకి వచ్చాడు విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్. అన్నకు అనూహ్య స్టార్డమ్‌ రావడంతో తానూ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ‘దొరసాని’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. తెలంగాణాలో దొరల పాలన బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ ప్రేమకథలో చాలెంజింగ్‌ రోల్‌ చేసి మెప్పించాడు ఆనంద్‌. రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా ఈ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర అంతగా ఆడకపోయినా.. విమర్శల ప్రశంసలు అందుకుంది. ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 11, 2020 / 05:13 PM IST
    Follow us on


    అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదులుకొని సినిమాల్లోకి వచ్చాడు విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్. అన్నకు అనూహ్య స్టార్డమ్‌ రావడంతో తానూ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ‘దొరసాని’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. తెలంగాణాలో దొరల పాలన బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ ప్రేమకథలో చాలెంజింగ్‌ రోల్‌ చేసి మెప్పించాడు ఆనంద్‌. రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా ఈ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర అంతగా ఆడకపోయినా.. విమర్శల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ రిలీజై చాలా ఏడాది అయింది. ఇప్పుడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు చిన్న దేవరకొండ అదే ఆనంద్‌ దేవరకొండ. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్లో ‘మిడిల్ క్లాస్‌ మెలోడీస్‌’ అనే సినిమాలో నటించాడు ఆనంద్. వర్ష బొల్లమ్మ హీరోయిన్. వినోద్‌ అనంతోజు దర్శకత్వం వహించాడు. కేరాఫ్‌ కంచరపాలెం ఫేమ్‌ స్వీకర్ అగస్తి మ్యూజిక్‌ డైరెక్టర్.

    సచివాలయం కూల్చివేతకు.. కేటీఆర్ కు లింకేంటీ?

    ఈ మూవీ షూటింగ్‌ పూర్తయింది. ఫస్ట్‌ కాపీ సిద్ధంగా ఉందని నిర్మాత వెనిగళ్ల ఆనంద్‌ ప్రసాద్‌ ప్రకటించాడు. కథకు ప్రాధాన్యం ఉండాలన్న సంకల్పంలో భాగంగానే ఈ చిత్రం తీశామని చెప్పాడు. సాధారణ జీవితాల్లో ఉండే సున్నితమైన హాస్యాన్ని మూవీలో చూపించామని డైరెక్టర్ వినోద్‌ తెలిపాడు. ప్రతి ఒక్కరూ తమను తాము గుర్తించుకునేలా పాత్రలు ఉంటాయన్నాడు. మంచి ప్రేమ కథ కూడా ఉంటుందని, ఆనంద్‌ తొలి సినిమాకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పాడు. ఇక, ‘దొరసాని’లో తెలంగాణ యాసలో మాట్లాడిన ఆనంద్‌.. ఈ మూవీలో గుంటూరు యాసలో మాట్లాడనున్నాడు. ఈ చిత్రాన్ని కొలకలూరు, గుంటూరు సిటీ, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించామని నిర్మాత చెప్పాడు. అన్ని పాత్రలు గుంటూరు యాసలోనే మాట్లాడుతాయని తెలిపాడు. వాస్తవానికి ఈ వేసవిలోనే సినిమాను రిలీజ్‌ చేయాలనుకున్నప్పటికీ.. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేశామని, త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించాడు.