Anand Deverakonda: ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన “పుష్పక విమానం”కు మంచి బజ్ క్రియేట్ అయింది. కారణం.. సినిమా మెయిన్ పాయింట్ చాలా బాగుండటంతో సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా క్రైమ్, కామెడీ కలిసిన కథ కాబట్టి.. ఎక్కువ మంది ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ప్లాప్ అయింది. కలెక్షన్స్ ను రాబట్టలేక మొత్తానికి తెలుగు బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది.

మరి ఇలాంటి ప్లాప్ సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు అంటేనే ఆశ్చర్యంగా ఉంది. పైగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి మూడు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. దాంతో ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కోసం పోటీ ఎక్కువ అయింది. పాయింట్ కి మంచి డిమాండ్ ఏర్పడిందనే ఆశతో హిందీ నిర్మాతలు ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు.
నిజానికి బాలీవుడ్ లో ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్ లకు మంచి ఆదరణ ఉంటుంది. బోల్డ్ పాయింట్ తో ఒక సినిమా వచ్చింది అంటే.. ఆ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తాయి. హిందీ ప్రేక్షకుల్లో కూడా ఆ సినిమాకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే, ‘పుష్పక విమానం’ సినిమా కూడా హిందీ జనానికి బాగా ఎక్కుతుంది అని హిందీ నిర్మాతల నమ్మకం.
Also Read: Celebrities: పెళ్లి పెటాకులు చేసుకున్న హీరోహీరోయిన్లు !
ఇక ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను ఏ సంస్థ తీసుకుందనే విషయాన్ని త్వరలోనే చెబుతామని ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే, ఇక్కడ మరో న్యూస్ కూడా వినిపిస్తోంది. ఇదంతా విజయ్ దేవరకొండ పబ్లిసిటీ మాయ అని.. ‘పుష్పక విమానం’ కు హిందీలో క్రేజ్ రావడం కోసం విజయ్ వేసిన ఎత్తుగడ ఇది అని తెలుస్తోంది.
Also Read: Vijay Setupathi: సేతుపతిపై దాడి చేస్తే రివార్డు ప్రకటంచిన హిందూవాదిపై పోలీసులు కేసు నమోదు