Atmakur By-Election : దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.

ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. ఆత్మకూరు అసెంబ్లీ స్థానికి ఈనెల 30 నోటిఫికేషన్ విడుదల కానుంది.
Also Read: Mahesh Babu-Taraka Ratna: మహేష్ కి బావగా నందమూరి హీరో.. క్రేజీ కాంబినేషన్ !
నామినేషన్లు దాఖలుకు జూన్ 6 వరకు గడువు విధించింది. జూన్7న నామినేషన్ల పరిశీలన, జూన్ 9 వరకు ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు. 26న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మూడు లోక్ సభ స్తానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం రాత్రి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
పంజాబ్, యూపీ , త్రిపుర, ఏపీ, ఢిల్లీ, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సైతం ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
Also Read: Balakrishna- Bindu Madhavi: ‘బిగ్ బాస్’ బిందు మాధవి బాలయ్యకి పెద్ద కూతురు.. అప్ డేట్ అదిరింది !
Recommended Videos:
[…] Also Read: Atmakur By-Election : ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల… […]
[…] Also Read:Atmakur By-Election : ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల… […]