Telugu Film Industry: సక్సెస్ వచ్చినంత మాత్రనా మనమే తోపులం కాదు…గర్వం ఎప్పటికీ పనికి రాదు…

ఇక్కడ మన ట్రెండ్ వాళ్ళకి ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది అందుకే మనవాళ్ళు మన ప్రతి సినిమా ని అక్కడ రిలీజ్ చేస్తూ సక్సెస్ లు కొడుతున్నారు. అంతే తప్ప అందులో మనం పెద్దగా పొడిచేసిందేమి లేదు ఇది గుర్తు పెట్టుకుంటే మంచిది.

Written By: Gopi, Updated On : December 26, 2023 2:45 pm
Follow us on

Telugu Film Industry: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ ని సౌత్ ఇండియన్ సినిమాలు చాలా వరకు డామినేట్ చేస్తూ వస్తున్నాయి.ఇక ఇప్పటికే మన బాహుబలి, కే జి ఎఫ్, కాంతారా, పుష్ప లాంటి సినిమాలు బాలీవుడ్ ని డామినేట్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన సలార్ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది.ఇక రాబోయే సినిమాలు కూడా బాలీవుడ్ ని బీభత్సంగా డామినేట్ చేయడానికి రెడీ అవుతున్నాయంటూ మనవాళ్లు చంకలు గుద్దుకుంటున్నారు. నిజానికి దీంట్లో మన దర్శకులు చేస్తుంది ఏమి లేదు. మన దగ్గర పాపులర్ అయిన మాస్ కమర్షియల్ సినిమాలని వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి సౌత్ నుంచి వెళ్లే మాస్ కమర్షియల్ సినిమాలే ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ లు సాధిస్తున్నాయి.

ఇక్కడ మన ట్రెండ్ వాళ్ళకి ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది అందుకే మనవాళ్ళు మన ప్రతి సినిమా ని అక్కడ రిలీజ్ చేస్తూ సక్సెస్ లు కొడుతున్నారు. అంతే తప్ప అందులో మనం పెద్దగా పొడిచేసిందేమి లేదు ఇది గుర్తు పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మన దర్శకులు మంచి దర్శకులు అయినప్పటికీ ఎప్పుడూ అవే హింస అదే రక్తపాతాన్ని చూపిస్తూ వస్తున్నారు. ఇది ఒకానొక సమయానికి బోర్ కొట్టె అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే దానికి మించి ఇంకేదైనా చేసే ప్రయత్నంలో మన దర్శకులు ఉంటే మంచిది ఇప్పటికి కూడా సందీప్ రెడ్డివంగ బోల్డ్ సీన్స్ తో అరాచకమైన రక్తపాతాన్ని కూడా చూపిస్తూ సినిమాలను హిట్ చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ కూడా ఎప్పుడూ ఆ మసి ని అలాగే రక్తపాతాన్ని చూపిస్తూ సినిమాలు చేస్తున్నారు.ఇప్పుడు అయితే అవి కొత్తగా ఉండి సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి.

కానీ ఇకమీదట కూడా ఇలాంటి సినిమాలే చేస్తే మాత్రం మన సినిమాలకి బాలీవుడ్ జనాలు స్వస్తి పలకాల్సిన సమయం వస్తుంది…ఇక రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్ మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ గ్రాఫిక్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ సినిమాలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్త ఉంటాడు కాబట్టి అందరికీ నచ్చే సినిమాలు తీయడం లో ఆయన సక్సెస్ అవుతూ ఉంటాడు. ఇక సుకుమార్ విషయానికి వస్తే పుష్ప సినిమా తెలుగులో సో సో గా ఆడినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ సాధించింది. అంటే మన తెలుగు వాళ్లకి ఆ సినిమా ఇంతకు ముందు చూసినట్టుగా అనిపించడంతో ఇక్కడ పెద్దగా ఆడలేదు కానీ బాలీవుడ్ లో మాత్రం వాళ్ళకి కొత్తగా అనిపించి వాళ్ళు ఎక్కువ సార్లు సినిమాని చూశారు. ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఇక ముందు రాబోయే మహేష్ – రాజమౌళి గాని,ఎన్టీయార్ – ప్రశాంత్ నీల్ కానీ, రామ్ చరణ్- శంకర్ కానీ, పవన్ కళ్యాణ్ – సుజీత్ కానీ ఎవరి సినిమాలు అయిన కానీ అవి క్రియేటివిటీకి తగ్గట్టుగా ఉంటేనే బాలీవుడ్ లో సక్సెస్ సాధిస్తాయి. బాలీవుడ్ మన కంటే తక్కువేం కాదు వాళ్ళ దగ్గర కూడా పొటెన్షియల్టీ ఉంది. సూపర్ హిట్ సినిమాలు తీసిన చరిత్ర వాళ్లకు కూడా ఉంది. కాబట్టి మనం వాళ్ళని తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వాళ్ళు మనల్ని తక్కువ చేసి చూశారు.ఇప్పుడు మనం కూడా వాళ్ళని తక్కువ చేసి చూస్తే అది మన మూర్ఖత్వం అవుతుంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. వాళ్లతో సంబంధం లేకుండా మన సినిమాలు మనం చేసుకుంటూ మంచి సినిమాని ప్రేక్షకుడిగా అందించడానికి ప్రయత్నం చేస్తే ఆ సినిమాలు ఎప్పటికైనా మంచి సక్సెస్ లను సాధిస్తాయి. అలాగే ఆ సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ కి కూడా మంచి పేరు వస్తుంది అంటూ మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు….