spot_img
Homeఎడ్యుకేషన్Success story: ఎస్ఐలుగా ఎంపికైన అక్కాచెల్లెళ్లు.. కష్టపడి పైకొచ్చిన వీరి సక్సెస్ స్టోరీ ఇదీ

Success story: ఎస్ఐలుగా ఎంపికైన అక్కాచెల్లెళ్లు.. కష్టపడి పైకొచ్చిన వీరి సక్సెస్ స్టోరీ ఇదీ

Success story: పట్టుదల, పంతం, స్పష్టమైన లక్ష్యం ఉంటే సాధించలేదనిది ఏది లేదు. దీనిని మరోసారి నిరూపించారు బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మల్కిపురం అక్కాచెల్లెళ్లు. ఎస్సై కొలువు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం పంతం పట్టారు. పట్టుదలతో సాధన చేశారు. ఇంకేముంద గోల్‌ను రీచ్‌ అయ్యారు. ఇటీవల ఏపీ ప్రకటించిన ఎస్సై ఫలితాల్లో ఇద్దరూ ఎస్సైలుగా సెలక్ట్‌ అయ్యారు. దీంతో మల్కీపురం పొంగిపోతోంది.

సాధారణ కుటుంబంలో పుట్టి..
సాధారణ కుటుంబంలో పుట్టిన కరుణ, రేవతి అక్కాచెల్లెళ్లు. ఇద్దరిదీ ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. అడ్డంగులను అధిగమిస్తూ, పరస్పరం సాయం చేసుకుంటూ ముందుకు సాగారు. దీంతో డబుల్‌ విక్టరీ వారి సొంతమైంది. అందరికీ ఆ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. అందరూ గొప్పగా చెప్పుకునేలా చేసింది.

తల్లిదండ్రుల సాయం..
సాధారణంగా ఆడపిల్లలను పోలీస్‌ కొలువుకు ప్రోత్సహించేవారు తక్కువగా ఉంటారు. కానీ, ఎస్సై కావలనుకున్న కరుణ, రేవతి లక్ష్యాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఇందుకోసం డీసీపీ మోకా సత్తిబాబు–రమాదేవి ట్రస్టు ద్వారా ఉచితంగా శిక్షణ తీసుకున్నారు. పట్టుదలతో సాధన చేశారు. లక్ష్యాన్ని సాధించారు. తమ ట్రస్టులో ఉచిత శిక్షణ తీసుకున్న పేద అక్కాచెల్లెళ్లు కరుణ రేవతి ఎస్సైగా ఉద్యోగాలు సాధించడం గర్వంగా ఉందని ట్రస్టు నిర్వాహకుడు సత్తిబాబు అన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే.. లక్ష్యం ఉన్నవారిని ప్రోత్సహిస్తే ఫలితం ఎలా ఉంటుందో కరుణ, రేవతి నిదర్శనమన్నారు.

తండ్రి చికెన్‌ సెంటర్‌..
కరుణ, రేవతిల తండ్రి సకినేటిపల్లిలో ఓ చికెన్‌ సెంటర్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థికంగా తమ పరిస్థితి ఏమితో ఆ అక్కా చెల్లెళ్లు బాగా అర్థం చేసుకున్నారు. అయినా లక్ష్యం మార్చుకోలేదు. పట్టుదల వీడలేదు. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగారు. లక్ష్యాన్ని చేరుకుని ఇద్దరూ ఒకేసారి ఎస్సైలుగా ఎంపికయ్యారు. దీంతో ఊరంగా పండుగ జరుపుకుంటోంది. ఆదర్శంగా నిలిచిన కరుణ, రేవతిని అందరూ అభినందిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper
Exit mobile version