Anaganaga Oka Raju Plus And Minus Points: నవీన్ పోలీస్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పిస్తు పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్ని ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కావడంతో ప్రతి సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా ఇంతకుముందు చేసిన జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి సినిమాలను చేసింసూపర్ సక్సెస్ లను సాధించాడు దాంతో అనగనగా ఒక రాజు సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ తగ్గట్టుగానే ఈ సినిమా ప్రతివిరేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా సైతం అధ్యంతం ప్రేక్షకుడిని నవ్వించింది అంటూ సినిమాని చూసిన ప్రేక్షకులు చాలా ఆనందంగా చెప్పుకుంటున్నారు…ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో చేశారనే చెప్పాలి. ఈ సినిమాలో డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా వన్ లైన్ పంచులైతే ప్రేక్షకులందరికి గుర్తుండిపోతున్నాయనే చెప్పాలి. నవీన్ పోలిశెట్టి ఈ సినిమాకి డైలాగులు రాయడం వల్ల తన ఈజ్ తో తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా డైలాగులను రాసుకున్నాడు. అందువల్లే ఈ సినిమాకి డైలాగులు బాగా కుదిరాయి.
మొత్తానికైతే ప్రతి ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఎంటర్ టైన్ అవుతున్నాడు. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి సైతం ఈ సినిమాకి చాలా బాగా సెట్ అయింది తన పాత్రకి న్యాయం చేసింది… ఫస్టాఫ్ హిలెరియాస్ కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చింది… మిక్కీ జే మేయర్ మ్యూజిక్ బాగుంది… ముఖ్యంగా భీమవరం బాలమా అనే సాంగ్ థియేటర్లో ప్రేక్షకులందరు ఎంజాయ్ చేస్తున్నారు…
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండాఫ్ లో వచ్చే ఎలక్షన్ డ్రామా అనేది మరి లాగ్ అయింది. ఆ ఒక్క ఎపిసోడ్ కనక లేకపోతే సినిమా క్లీన్ గా ప్రేక్షకులను ఆకట్టుకునేది అలాగే ప్రీ క్లైమాక్స్ లో కూడా కొంతవరకు లాగ్ చేశారు. అక్కడ ఒక సాంగ్ కూడా పెట్టారు ఆ సాంగ్ వల్ల సినిమాకి వచ్చే లాభమైతే లేదు. నిజానికి ఆ సాంగ్ తీసేసిన కూడా సినిమా ఎమోషన్ అనేది పర్ఫెక్ట్ గా రన్ అయ్యేది…