Toyota Sienna 2026: అంతర్జాతీయ మోటార్ సంస్థ టయోటా కొత్త కొత్త మోడళ్లతో కార్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రపంచ మార్కెట్‌లో మంచి షేర్ ఉన్న టయోటా తాజాగా ప్రపంచ మార్కెట్‌లోకి కొత్త ఏడాది కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. పెద్ద కుటుంబాలకు అనువుగా ఉండేలా రూపొందించిన సియెన్నా 2026ను పూర్తి సౌకర్యంతో రూపొందింది. ఆధునిక లుక్, హైబ్రిడ్ టెక్నాలజీ, దీర్ఘ ప్రయాణాలకు అనుకూలతలతో మార్కెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించనుంది. ఈ మినీవ్యాన్ రోజువారీ ఉపయోగం నుంచి లాంగ్ ట్రిప్‌ల వరకు మల్టీపుల్‌గా ఉపయోగపడుతుంది.
అదిరిపోయే లుక్..
విశాల గ్రిల్, స్లీక్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు ముందు భాగాన్ని ఆకర్షణీయంగా మార్చాయి. ఏరోడైనమిక్ లైన్లు, స్లయిడింగ్ డోర్లు, అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ డైనమిక్ లుక్ ఇస్తాయి. వెనుక ఎల్‌ఈడీ టైల్ లైట్లు, స్పాయిలర్ ప్రీమియం ఫినిష్ పూర్తి చేస్తాయి.
హైబ్రిడ్ ఇంజిన్..
గ్యాసోలిన్–ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్ మృదువైన యాక్సిలరేషన్, తక్కువ ఎమిషన్లు అందిస్తుంది. రీజెనరేటివ్ బ్రేకింగ్ ఇంధన ఆదా పెంచుతుంది. నగర ట్రాఫిక్, హైవేలకు అనుకూలం.
విశాలమైన ఇంటీరియర్..
7–8 మంది సీటింగ్, ఫోల్డబుల్ సీట్లు, మెరుగైన మెటీరియల్స్ దీర్ఘ యాత్రలకు సపోర్ట్ చేస్తాయి. వెనుక లెగ్‌రూమ్, క్లైమేట్ కంట్రోల్, స్టోరేజ్ ఆప్షన్లు కుటుంబాలకు ఆదర్శం.
టెక్, కనెక్టివిటీ హైలైట్స్
టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వాయిస్ కమాండ్స్, వైర్‌లెస్ చార్జింగ్, వైఫై హాట్‌స్పాట్ సౌలభ్యం. హైబ్రిడ్ ఎనర్జీ మానిటరింగ్ డిస్‌ప్లేలు డ్రైవర్‌కు సహాయం. అడాప్టివ్ క్రూయిజ్, లేన్ అసిస్ట్, బ్లైండ్–స్పాట్ మానిటరింగ్, 360–డిగ్రీ కెమెరా ప్రమాదాలను నివారిస్తాయి. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రీన్‌ఫోర్స్‌డ్ ఫ్రేమ్ పూర్తి రక్షణ ఇస్తుంది.
నేచర్ ఫ్రెండ్లీ..
హైబ్రిడ్ సిస్టమ్ తక్కువ డిసెల్ ఉపయోగం, ఎకో–ఫ్రెండ్లీ మెటీరియల్స్‌తో సస్టైనబుల్. లైట్‌వెయిట్ కాన్‌స్ట్రక్షన్ రైడ్ స్థిరత్వం పెంచుతుంది.
మొత్తంగా స్లయిడింగ్ డోర్లు, అమ్పుల్ స్టోరేజ్, సిటీ డ్రైవింగ్ అనుకూల స్టీరింగ్. స్కూల్ రన్స్ నుంచి వీకెండ్ ట్రిప్‌లకు సరిపోతుంది. సస్పెన్షన్ రోడ్ షాక్స్‌ను గ్రహిస్తుంది, క్వైట్ క్యాబిన్. కుటుంబాలు, కమ్యూటర్లకు హైబ్రిడ్ ఎఫిషియెన్సీతో ప్రీమియం ఎంపిక.