Anaganaga Oka Raju Movie: ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో ఈపాటికే స్పష్టంగా మీ అందరికీ అర్థం అయిపోయి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం తిరుగులేని వసూళ్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద డామినేషన్ ని చూపిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రం ఫ్లాప్ అవ్వడం చిరంజీవి సినిమాకు బాగా కలిసొచ్చింది. ఇక నిన్న విడుదలైన రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా పెద్ద రేంజ్ ఓపెనింగ్ ని సొంతం చేసుకోలేకపోయింది. ఫలితంగా ఈ సినిమా కూడా చిరంజీవి సినిమాపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. కానీ నేడు విడుదలైన నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రానికి మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ టాక్ కారణంగా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా నమోదు అవుతున్నాయి.
బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 12 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఇది ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. ఈ సినిమా ప్రభావం ‘మన శంకర వరప్రసాద్ గారు’ పైన పడుతుందా? అంటే తెలుగు రాష్ట్రాల వరకు అసాధ్యం అనే చెప్పాలి. చిరంజీవి సినిమాకు టికెట్స్ దొరకని వాళ్ళు, ‘అనగనగా ఒక రాజు’ చిత్రానికి బుక్ చేసుకోవచ్చు. అంత వరకు మాత్రమే, ఆడియన్స్ కి సెకండ్ ఛాయస్ గా ఏ చిత్రం నిలుస్తుంది అనేదానిపై ఈ చిత్రం తో ట్రేడ్ విశ్లేషకులకు స్పష్టమైన క్లారిటీ వచ్చేసింది. ఇదంతా పక్కన పెడితే ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై కాస్త లీడింగ్ చూపించింది. నార్త్ అమెరికా లో ఈ రెండు చిత్రాలకు నిన్న నేడు నమోదైన గ్రాస్ వసూళ్లను ఒకసారి చూద్దాం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే మొదటి రోజు ‘అనగనగా ఒక రాజు’ చిత్రానికి $90K డాలర్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగితే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి మూడవ రోజుకి గానూ $75K డాలర్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. మరో విశేషం ఏమిటంటే ‘అనగనగా ఒక రాజు’ చిత్రానికి చిరంజీవి సినిమా తో పోలిస్తే చాలా తక్కువ షోస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా లీడింగ్ చూపించడం ట్రేడ్ ని కాస్త సర్ప్రైజ్ కి గురి చేసింది. మరి ఇదే రేంజ్ ట్రెండ్ రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందా లేదా అనేది చూడాలి. మరో పక్క ‘రాజా సాబ్’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాలకు నార్త్ అమెరికా లో కనీస స్థాయిలో కూడా వసూళ్లు నమోదు అవ్వడం లేదు.