Anaganaga Oka Raju First Week Collections: ఈ సంక్రాంతికి విడుదలైన 5 చిత్రాల్లో మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం తర్వాత, ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న రెండవ చిత్రం ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju). నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరో గా నటించిన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. 5వ రోజు నుండి బయ్యర్స్ ఈ చిత్రానికి లాభాలు లెక్కపెట్టుకుంటున్నారు. అయితే పండగ సెలవుల్లో ఈ చిత్రం చూపించిన జోరు, మామూలు వర్కింగ్ డేస్ లో పెద్దగా చూపించడం లేదు. ఆరవ రోజున ఈ చిత్రం కోటి కోటి 83 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబడితే, 7వ రోజున కేవలం కోటి 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఓవరాల్ గా వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతంలో నిన్న వచ్చిన కలెక్షన్స్ తో ఈ చిత్రం 10 కోట్ల షేర్ మార్కుని దాటినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా సీడెడ్ నుండి 3 కోట్ల 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 5 కోట్ల 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. నైజాం, ఓవర్సీస్ తర్వాత ఈ సినిమా కి బెస్ట్ కలెక్షన్స్ ఇస్తున్న జిల్లా ఉత్తరాంధ్ర నే అవ్వడం విశేషం. ఇక ఈ సినిమా షూటింగ్ ని జరుపుకున్న తూర్పు గోదావరి జిల్లా లో మొదటి వారం 3 కోట్ల 36 లక్షల రూపాయిలు రాగా, పశ్చిమ గోదావరి జిల్లా నుండి కోటి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కృష్ణా జిల్లా నుండి కోటి 73 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 2 కోట్ల 13 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి కోటి 14 లక్షలు వచ్చాయి.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 29 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, ఓవర్సీస్ నుండి 8 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 39 కోట్ల 46 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 71 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో కచ్చితంగా వంద కోట్ల గ్రాస్ ని ఈ చిత్రం రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.