Anaganaga Oka Raju First Review: చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ, తన ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ తో యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty). క్యారక్టర్ ఆర్టిస్టు గా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత బాలీవుడ్ లో పలు టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరించి మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రం తో హీరో గా మారి భారీ హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన ‘జాతి రత్నాలు’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని చేసిన ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి ‘ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యింది. ఈ సినిమా తర్వాత దాదాపుగా రెండేళ్ల విరామం తీసుకొని ఆయన చేసిన చిత్రం ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju).
షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు, టీజర్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవీన్ పోలిశెట్టి మరోసారి భారీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అనే నమ్మకాన్ని ఇచ్చింది ఈ టీజర్స్. అయితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కాపీ సిద్ధంగా ఉందట. నిన్ననే ఈ చిత్రాన్ని ప్రసాద్ ల్యాబ్స్ లో హీరో, డైరెక్టర్, నిర్మాత నాగవంశీ తో పాటు పలువురు మీడియా ప్రతినిధులు, అదే విధంగా కొన్ని ప్రాంతాల బయ్యర్స్ కి స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారట. వారి నుండి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కే భారీ బ్లాక్ బస్టర్ కొట్టేశారని, నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు.
నిర్మాత నాగవంశీ అయితే ఫస్ట్ హాఫ్ చూసి మెంటలెక్కిపోయాడట. డైరెక్టర్ మారి కి షో పూర్తి అయ్యాక అభినందించడమే కాకుండా, నాగవంశీ 12 లక్షల రూపాయిల విలువ చేసే వాచ్ ని బహుమతిగా ఇచ్చాడట. నాగవంశీ ని ఆ రేంజ్ లో సంతృప్తి పరిచిన సినిమా అయితే , కచ్చితంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కొట్టేసినట్టే అనుకోవచ్చు. ఈ సినిమా కారణంగా ‘రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆ రెండు సినిమాలకు కాస్త తేడా టాక్ వచ్చినా, సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ మూవీ కి వార్ వన్ సైడ్ లాగా మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.