Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్లో ఊహించని మలుపు… హౌస్ మేట్స్ అందరూ ఫుల్ హ్యాపీ!

మిగిలిన అర్జున్, అశ్విని, అమర్ దీప్, యావర్, గౌతమ్, ప్రియాంక, శోభ, రతిక నామినేట్ అయ్యారు. మంగళవారం రాత్రి మొదలైన ఓటింగ్ శుక్రవారంతో ముగిసింది.

Written By: NARESH, Updated On : November 19, 2023 1:53 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: ఆదివారం వచ్చిందంటే నామినేషన్స్ లో ఉన్న హౌస్ మేట్స్ కి చెమటలు పడతాయి. ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంటుంది. ఎవరు ఇంటిని వీడుతారనే సస్పెన్సు కొనసాగుతోంది. 10 వారాలు పది మంది హౌస్ మేట్స్ ఇంటిని వీడారు. గత వారం పాట బిడ్డ భోలే షావలి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్లో టాప్ 10 ఉన్నారు. శివాజీ కెప్టెన్ గా ఉన్నాడు. కాబట్టి ఆయన 11వ వారం నామినేషన్స్ లో లేరు. అలాగే పల్లవి ప్రశాంత్ కి ఒక ఓటు మాత్రమే పడింది. దాంతో అతడు కూడా నామినేషన్స్ నుండి మినహాయింపు పొందాడు.

మిగిలిన అర్జున్, అశ్విని, అమర్ దీప్, యావర్, గౌతమ్, ప్రియాంక, శోభ, రతిక నామినేట్ అయ్యారు. మంగళవారం రాత్రి మొదలైన ఓటింగ్ శుక్రవారంతో ముగిసింది. పలు అనధికారిక సర్వేల ప్రకారం యావర్ ఓటింగ్ లో టాప్ లో ఉన్నాడు. శివాజీ, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ లో లేరు. వారిద్దరి అభిమానులు కూడా యావర్ కి ఓట్లు వేయడం కలిసొచ్చిందని అంటున్నారు.

కాగా అశ్విని, రతిక, శోభ డేంజర్ జోన్లో ఉన్నారని తెలిసింది. అశ్విని లేదా రతిక ఎలిమినేట్ కావచ్చనే వాదన వినిపించింది. శోభను ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదు. స్టార్ మా బ్యాచ్ కి చెందిన కంటెస్టెంట్ కావడంతో మొదటి నుండి ఆమెను సేవ్ చేస్తున్నారు. రతిక, అశ్వినిలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంచనా వేశారు. అసలు డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. రతిక, అశ్విని అవుట్ అంటూ మరో ప్రచారం వినిపించింది.

ఇవేమీ కాదట. తాజా సమాచారం ప్రకారం ఈ వారం ఎలాంటి ఎలిమినేషన్ లేదు. టాప్ 10 కంటెస్టెంట్స్ సేఫ్ అంటున్నారు. నెక్స్ట్ వీక్ మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. దీంతో డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఫుల్ హ్యాపీ అయ్యారట. దీనిపై క్లారిటీ రావాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.