OG pre-release event: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం మరో 18 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగా అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరో పక్క థియేటర్స్ లో సరైన సినిమాలు లేక వెలవెలబోతున్నాయి. అడపాదడపా కొన్ని చిన్న సినిమాలు సూపర్ హిట్ అవ్వడం వల్ల కాస్త ఉపశమనం కలిగింది కానీ, ఒకప్పుడు ఉన్న పరిస్థితి మాత్రం ఇప్పుడు లేదు. కచ్చితంగా ఒక భారీ హిట్ పడాల్సిందే, లేదంటే సింగిల్ స్క్రీన్స్ డేంజర్ జోన్ లో పడినట్టే. ఆ భారీ హిట్ ఓజీ రూపం లో వస్తుందని ట్రేడ్ చాలా బలంగా నమ్ముతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.
అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకు 18 రోజుల ముందే 50 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి అట. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే 42 వేల టిక్కెట్లు, 12 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చూస్తే ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 12 కోట్ల రూపాయిలు దాటి ఉంటుందని అంచనా. ఇది సాధారణమైన రికార్డు కాదు, రీసెంట్ గా విడుదలైన కొన్ని పాన్ ఇండియన్ సినిమాలు ఓజీ కి దరిదాపుల్లో కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదంతా పక్కన పెడితే ఫ్యాన్స్ మూవీ టీం ప్రొమోషన్స్ పై తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు. పవన్ కళ్యాణ్ నుండి రాక రాక వస్తున్న ఒక అద్భుతమైన ఈవెంట్ మూవీ కి కనీస స్థాయిలో కూడా ప్రొమోషన్స్ చేయడం లేదని, మేము మూవీ టీం ని చాలా గొప్పగా ఊహించుకున్నాము కానీ, అంచనాలకు తగ్గట్టుగా అసలు ముందుకు వెళ్లడం లేదంటూ మండిపడుతున్నారు.
అయితే మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ముగించే ప్రక్రియ లో ఫుల్ బిజీ గా ఉన్నారట. పనులు మొత్తం పూర్తి అయ్యాక ప్రశాంతంగా ప్రొమోషన్స్ ని ప్రారంభించవచ్చు అనే ఉద్దేశ్యం తో ఉన్నారట. మరో రెండు రోజుల్లో పనులు పూర్తి అవుతాయని, పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కూడా పూర్తి అవుతుందని, అప్పటి నుండి ప్రొమోషన్స్ జెట్ స్పీడ్ లో ఉంటాయని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనీ అనుకుంటున్నారట. ఒకటి విజయవాడ లో 19 వ తేదీన నిర్వహిస్తారట, మరొకటి 21 వ తేదీన హైదరాబాద్ లో నిర్వహిస్తారట. హైదరాబాద్ లో ఏర్పాటు చేసే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొంటాడని టాక్.