OG Pre Release Event: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘ఓజీ'(They Call Him OG) చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా నేడు హైదరాబాద్ లోని LB స్టేడియం లో ఈ సినిమాకు సంబంధించిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ‘ఓజీ మ్యూజిక్ కన్సర్ట్’ పేరు తో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన పాసుల కోసం అభిమానులు ఒక రేంజ్ లో బారులు తీరారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. LB స్టేడియం లాంటి స్థానాన్ని ఎంచుకొని మంచి పని చేశారు, ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కి శిల్ప కళా వేదిక లాంటి చోట అయితే తొక్కిసలాట జరిగే ప్రమాదం కూడా ఉండేది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు చెప్పుకొచ్చారు. గతం లో ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఇలాంటి సంఘటనలు జరిగే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించడం తో ఈవెంట్ ని రద్దు చేశారు.
ఇప్పుడు ‘ఓజీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా అలాంటి పరిస్థితి జరిగే అవకాశం ఉంది. అందుకే మేకర్స్ LB స్టేడియం ని ఎంచుకున్నారు. ఇక ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంగీత దర్శకుడు థమన్ ఏమి మాట్లాడుతాడో, డైరెక్టర్ సుజీత్ ఫ్యాన్స్ కి ఎలాంటి భరోసా ఇస్తాడో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉండబోతుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఇదంతా పక్కన పెడితే ఈ ఈవెంట్ లో డైరెక్టర్ సుజిత్ ఫ్యాన్స్ కి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. అది ఏమిటంటే రెబెల్ స్టార్ ప్రభాస్ ఓజీ మూవీ టీం కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక వీడియో బైట్ ని చేసాడట. దీనిని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానుల సమక్షం లో ప్లే చేస్తారట.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా మరియు బయట మంచి సాన్నిహిత్యం ఉంది. ఒకరి హీరోని ఒకరు ఎంతో గౌరవించుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్న ఆ బంధాన్ని ఈ వీడియో మరింత బలపరుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓజీ మూవీ ఓపెనింగ్స్ కి కూడా ఈ వీడియో బైట్ బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు విశ్లేషకులు. అదే విధంగా ప్రభాస్ ఈ సినిమాలో కూడా ఒక చిన్న రోల్ లో కనిపించబోతున్నాడు అనే టాక్ ఉంది. అదే నిజమైతే మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ బ్లాస్ట్ అవుతాయి అనే చెప్పొచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఇకపోతే ఈ సినిమాకు సంబందించిన థియేట్రికల్ ట్రైలర్ కూడా నేడే రాబోతుంది.