Manchu Manoj: మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచు మనోజ్(Manchu Manoj), కెరీర్ ప్రారంభం నుండే భిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకున్నాడు. ఈయన సినిమాల్లోని పాటలకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. కెరీర్ మంచి ఊపుతోనే వెళ్తుంది. కానీ మధ్య ఏర్పడిన కొన్ని సంఘటనల కారణంగా 9 ఏళ్ళు సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్ ని విలన్ గా ప్రారంభించాడు. రీసెంట్ గానే భైరవం చిత్రం లో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ తో మన ఆడియన్స్ ని అలరించిన మంచు మనోజ్, రీసెంట్ గా విడుదలైన ‘మిరాయ్’ చిత్రంలో పూర్తి స్థాయి విలన్ క్యారక్టర్ చేసి ఆడియన్స్ నుండి మంచి మార్కులు కొట్టేసాడు. ఇప్పుడు ఆయన మరోసారి విలన్ క్యారక్టర్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) త్వరలోనే బాబీ దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండవ చిత్రమిది. అందుకే ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మేకర్స్. విలన్ క్యారక్టర్ కోసం ఫ్రెష్ ఫేస్ కావాలి, అందుకు మనోజ్ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని ఆయన్ని సంప్రదించారట. మనోజ్ కూడా ఇందులో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని టాక్. విశేషం ఏమిటంటే మనోజ్ తండ్రి మోహన్ బాబు అప్పట్లో చిరంజీవి ప్రతీ సినిమాలోనూ విలన్ గా కనిపించేవాడు. వీళ్ళ కాంబినేషన్ లో ఎన్ని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. అయితే మోహన్ బాబు హీరో గా మారి స్టార్ అయ్యాక, చిరంజీవి తో కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆయన కూడా స్పెషల్ క్యారెక్టర్స్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.
కాబట్టి భవిష్యత్తులో ఆయన మళ్లీ చిరంజీవి సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి కానీ, ఆయన తనయుడు మనోజ్ మాత్రం మెగాస్టార్ తో కలిసి నటించడం నిజంగా స్పెషల్ అనే చెప్పాలి. చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్, మోహన్ బాబు, చిరంజీవి కాంబినేషన్ ని మరపిస్తుందా లేదా అనేది. ఒకవేళ క్లిక్ అయితే మాత్రం వీళ్ళ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు చూడొచ్చు. మనోజ్ కేవలం విలన్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా, హీరో క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన మూడు సినిమాల్లో హీరో గా నటించడానికి ఒప్పుకున్నాడు. చూస్తుంటే మనోజ్ తమిళం లో విజయ్ సేతుపతి లాగ తన సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ ని మలుచుకునే ప్రయత్నం లో ఉన్నాడని తెలుస్తుంది.