Top Stars Remunerations: ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్, పవన్, చరణ్.. టాప్ స్టార్స్ రెమ్యూనరేషన్స్ లీక్, ఎవరు టాప్? ఎవరు లీస్ట్?

మహేష్ బాబు సైతం అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. ఆయన చాలా కాలంగా రూ. 50 కోట్లు తీసుకుంటున్నారు. రాజమౌళి సినిమాకు మహేష్ రెమ్యూనరేషన్ రూ. 100 కోట్లకు పైమాటే.

Written By: NARESH, Updated On : November 8, 2023 2:13 pm

Top Stars Remunerations

Follow us on

Top Stars Remunerations: టాలీవుడ్ దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఎదిగింది. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్స్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు. వందల కోట్ల వసూళ్లు అవలీలగా రాబడతారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్స్ ఇంకా సత్తా చాటుతున్నారు. దీంతో ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు టాలీవుడ్ లో ఉన్నారు.

ప్రభాస్ సినిమాకు రూ. 100 నుండి 150 కోట్లు తీసుకుంటున్నారు. ఆయన ప్లాప్ మూవీ కూడా ఈజీగా మూడు వందల కోట్లు రాబడుతుంది. ఆదిపురుష్ కి ఆయన రెమ్యూనరేషన్ రూ. 150 కోట్లని సమాచారం.

పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్, పుష్ప రూ. 350 కోట్ల వరకు వసూలు చేసింది. ఆ చిత్రానికి రూ. 60 కోట్లు తీసుకున్న అల్లు అర్జున్, పుష్ప 2 కి రూ. 80 నుండి 100 కోట్లు తీసుకుంటున్నాడట.

పవన్ కళ్యాణ్ ఒక్క పాన్ ఇండియా మూవీ చేయలేదు. అయినా ఆయనకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాకు రూ. 50 కోట్లు ఆయన ఛార్జ్ చేస్తున్నారు. హరి హర వీరమల్లుకు రూ. 60 తీసుకున్నాడట.

మహేష్ బాబు సైతం అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. ఆయన చాలా కాలంగా రూ. 50 కోట్లు తీసుకుంటున్నారు. రాజమౌళి సినిమాకు మహేష్ రెమ్యూనరేషన్ రూ. 100 కోట్లకు పైమాటే.

ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీకి ముందు వరకు రూ. 40 కోట్లు లోపు తీసుకునేవాడు. దేవర చిత్ర బడ్జెట్ రూ. 300 కోట్లు కాగా రూ. 60 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. వార్ 2 చిత్రానికి ఆయన రెమ్యూనరేషన్ రూ. 100 కోట్లకు పైనే అంటున్నారు.

రామ్ చరణ్ కూడా ఆర్ ఆర్ ఆర్ ముందు వరకు రూ. 40 కోట్ల కంటే తక్కువ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన రూ. 60 కోట్లు తీసుకుంటున్నారట. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చేస్తున్న విషయం తెలిసిందే.

యంగ్ స్టార్స్ కి పోటీ ఇస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. వాల్తేరు వీరయ్య మూవీ రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆయన రూ. 40 కోట్లు తీసుకుంటున్నారట.

అఖండ మూవీతో ఫారం లోకి వచ్చిన బాలకృష్ణ గతంలో రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారట. వరుస విజయాలతో ఫార్మ్ లోకి వచ్చిన బాలకృష్ణ రూ. 30 కోట్లు వరకు డిమాండ్ చేస్తున్నారట.

నాగ్, వెంకీల మార్కెట్ డౌన్ అయ్యింది. ఈ క్రమంలో రూ. 7 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారట. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ రూ. 20-25 కోట్లు తీసుకుంటున్నాడట. నాని రెమ్యునరేషన్ రూ. 15 నుండి 20 కోట్లు అంటున్నారు.

రవితేజ మార్కెట్ కూడా డౌన్ అయ్యింది. ఆయన ప్రస్తుత రెమ్యూనరేషన్ రూ. 15 కోట్లు అని సమాచారం. నాగ చైతన్య రూ. 6 కోట్లు తీసుకుంటున్నారట. నితిన్, శర్వానంద్, వరుణ్ రూ. 4 కోట్లు తీసుకుంటున్నారట.