Amrutha Pranay: తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు అమృత వర్షిణి(Amrutha Pranay) (అమృత ప్రణయ్). ప్రణయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని, పెద్దలకు తెలియకుండా వేరు కాపురం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన అమృత తండ్రి మారుతీ రావు, 2018 వ సంవత్సరం లో తన మనుషుల చేత ప్రణయ్ ని చంపించిన ఘటన దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఆ తర్వాత 2020 వ సంవత్సరం లో మారుతీ రావు అఘాయిత్యం చేసుకొని చనిపోయిన ఘటన కూడా సంచలనం గా మారింది. ఇలా ఎన్నో సంచనాలకు దారి తీసిన ఈ ఘటనకు సంబంధించిన ప్రధాన నిందితుడికి రీసెంట్ గానే ఉరి శిక్ష పడింది. ఇక ఆ తర్వాత అమృత తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటికి పేర్లు మార్చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ముందు అమృత ప్రణయ్ అని ఉన్న అకౌంట్స్ ని ఇప్పుడు అమృత వర్షిణి గా మార్చింది.
Also Read: ‘కిష్కింధపురి’ మూవీ గ్లింప్స్ ఒకే…కానీ ఆ మూవీ చాలు కనిపిస్తున్నాయా..?
ఇదంతా పక్కన పెడితే ప్రణయ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన తర్వాత, అమృత కొన్నాళ్ళకు సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. యూట్యూబ్ ఛానల్ ని ఒకటి ప్రారంభించి, వివిధ అంశాలపై ఆమె వ్లాగ్స్ చేయడం మొదలు పెట్టింది. తన కొడుకు నిహాన్ తో కలిసి ఎన్నో వీడియోస్ లో ఆడుతూ పాడుతూ కనిపించింది. అంతే కాకుండా ఈమె పలువురు సినీ సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేసింది. ఇలా నిత్యం ఎదో ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉన్న అమృత, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లోకి అడుగుపెట్టబోతున్నట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గానే బిగ్ బాస్ టీం ఆమెను సంప్రదించినట్టు, భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ ని కూడా ఇచ్చినట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై సోషల్ మీడియా లో ఎప్పటి నుండో చర్చలు నడుస్తున్నాయి.
ఈమధ్యనే అమృత యూట్యూబ్ లో ఒక వ్లాగ్ వీడియో చేసింది. సుమారుగా నెల రోజుల తర్వాత చేసిన వీడియో ఇది. ఇందులో ఆమె ఇన్ని రోజులు సోషల్ మీడియా లో తనపై జరుగుతున్న ప్రచారాల గురించి నెటిజెన్స్ కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అన్ని అంశాల గురించి చెప్పింది కానీ, బిగ్ బాస్ విషయం లో మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈ అంశం ఆమె వరకు చేరిందా లేదా?, ఒకవేళ చేరినా బిగ్ బాస్ షో మొదలు అయ్యే వరకు చెప్పకూడదు కాబట్టి రహస్యంగా ఉంచే క్రమంలో ఆమె ఈ అంశాన్ని ప్రస్తావించలేదా అనేది తెలియాల్సి ఉంది. అమృత బిగ్ బాస్ లోకి అడుగుపెడితే కచ్చితంగా ఆమె కెరీర్ మరో లెవెల్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. చూసేందుకు సినిమా హీరోయిన్ లాగ అనిపించే ఈ అమ్మాయికి ,కచ్చితంగా బిగ్ బాస్ తర్వాత అవకాశాలు కూడా రావొచ్చు.