Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) మన చిన్నతనం నుండి ఒకే లుక్ లో కనిపించడం తో, ఆడియన్స్ ఆ లుక్ కి బాగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఆయన రాజమౌళి(SS Rajamouli) సినిమా కోసం సరికొత్త గెటప్ లో కనిపించడం అందరికీ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది వరకు మహేష్ బాబు పొడవాటి జుట్టు తో కనిపించడం మనం విమానాశ్రయం లో ఆయన విదేశీ టూర్స్ కి వెళ్తున్నప్పుడు చూసాము. ఇప్పుడు రింగుల జుట్టు తో కనిపిస్తూ అందరినీ షాక్ కి గురి చేసాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి తో చేస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని శంకర్ పల్లి లో జరుగుతుంది. ఈ షూటింగ్ విరామం సమయం లో ఆయన సాంకేతిక నిపుణులతో కూర్చొని మాట్లాడుతున్న ఫొటోలో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మహేష్ బాబు పక్కనే ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా ఉంది.
టీ షర్ట్, పొట్టి షార్ట్ తో మహేష్ ఇందులో మనకి కనిపిస్తున్నాడు. అంటే వర్క్ షాప్ సమయంలో కానీ, లేకపోతే జిమ్ వర్కౌట్స్ చేస్తున్న సమయంలో కానీ తీసిన ఫోటో అయ్యుండొచ్చు అని సోషల్ మీడియా లో అభిమానులు ఊహిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ ని ఇటీవలే ఒడిశా ప్రాంతంలో పూర్తి చేయగా, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. సుమారుగా నెల రోజుల పాటు సాగే ఈ భారీ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన షెడ్యూల్ పూర్తి అయ్యాక మూవీ టీం మొత్తం విదేశాలకు వెళ్లనుంది. ఈ సినిమా షూటింగ్ అత్యధిక శాతం సౌత్ ఆఫ్రికా అడవుల్లో జరుగుతుందట. రాజమౌళి ఆరు నెలల క్రితమే లొకేషన్స్ ని వెతికి పట్టుకున్నాడట. అమెజాన్ అడవుల్లో కూడా కొన్ని రోజులు చిత్రీకరణ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.
ఇకపోతే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కాబట్టి, ఆరోజున ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం ఉంటుందా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పట్లో ఎలాంటి అప్డేట్ వచ్చే సూచనలే కనిపించడం లేదట. సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యాకనే గ్లింప్స్ వీడియో, లేదా మేకింగ్ వీడియో ని విడుదల చేసే అవకాశం ఉంటుందట. అప్పటి వరకు మహేష్ అభిమానులకు నిరీక్షణ తప్పదు. కాబట్టి ఎదురు చూడాల్సిందే. ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే కాదు. ప్రపంచ సినీ చరిత్ర లో ఇప్పటి వరకు ఎవ్వరూ ముట్టుకోని సబ్జెక్టు తో మన ముందుకు వస్తున్నాడట రాజమౌళి. 2027 వ సంవత్సరం లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.