Bigg Boss Telugu 8: గంగవ్వ కంటే నాగార్జునే పెద్దోడా? వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

గంగవ్వ ని బిగ్ బాస్ కి ఎందుకు పిలిచారు?, ఆమె వల్ల ఏ ఉపయోగం లేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే గంగవ్వ వయస్సు గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. వివరాల్లోకి వెళ్తే ఈమె వయస్సు కేవలం 62 ఏళ్ళు మాత్రమే.

Written By: Vicky, Updated On : October 21, 2024 1:56 pm

Bigg Boss Telugu 8

Follow us on

Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన గంగవ్వ గురించి అందరికీ తెలిసిందే. ఈమె సీజన్ 4 లో ఒక కంటెస్టెంట్ గా కొనసాగింది. నాలుగు వారాలు తర్వాత బిగ్ బాస్ హౌస్ వాతావరణంలో ఇమడలేక బయటకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ సీజన్ 8 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు అవినాష్ తో కలిసి ఒక్క గేమ్ అద్భుతంగా ఆడింది. అబ్బో పర్వాలేదే, ఈ వయస్సులో కూడా ఇరగదీసింది, ఇక ముందు కూడా ఇలాగే ఆడుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆరోజు తర్వాత ఇప్పటి వరకు ఆమె పెద్దగా గేమ్స్ ఆడడం చూడలేదు. కంటెస్టెంట్స్ తో అప్పుడప్పుడు సరదా ముచ్చట్లు ఆడడమే చూసాము కానీ, మొదటి రోజు ఆమెలో కనిపించిన జోష్ మళ్ళీ కనిపించలేదు. హౌస్ మేట్స్ కూడా వయస్సులో పెద్దావిడ కాబట్టి ఆమెతో టాస్కులు ఆడించి ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక సైలెంట్ గా కూర్చోబెడుతున్నారు.

ఈ మాత్రం దానికి అసలు గంగవ్వ ని బిగ్ బాస్ కి ఎందుకు పిలిచారు?, ఆమె వల్ల ఏ ఉపయోగం లేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే గంగవ్వ వయస్సు గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. వివరాల్లోకి వెళ్తే ఈమె వయస్సు కేవలం 62 ఏళ్ళు మాత్రమే. కానీ ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున వయస్సు 65 ఏళ్ళు. అంటే ‘గంగవ్వ’ కంటే నాగార్జున మూడేళ్లు పెద్ద అన్నమాట. కానీ నాగార్జున కూడా అందరి లాగా గంగ ‘అవ్వ’ అని పిలవడం చాలా కామెడీ గా అనిపిస్తుంది కదూ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ‘గంగవ్వ’ ఎదో అమ్మ వయస్సు ఉన్న ఆమె లాగ ట్రీట్ చేస్తున్నాడు నాగార్జున.

సీజన్ 4 గంగవ్వ ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్లేముందు నాగార్జున ఆమె ఇల్లు కట్టుకోవాలనే చిరకాల కోరికని తీర్చిన సంగతి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ టీం తో కొంత డబ్బు ని ఇప్పించి, ఆ తర్వాత నాగార్జున కూడా తన సొంత డబ్బులు వేసుకొని ఆమె కోరికను తీర్చారు. ఈసారి కూడా ఆమెకి అలాంటి సహాయం ఏదైనా చేయొచ్చు కదా, ఎందుకు బిగ్ బాస్ కి పిలిచారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్న మాట. ఎందుకంటే ఆమెని కంటెస్టెంట్స్ ఏ విషయం లోనూ బలంగా అడగలేకపోతున్నారు. నామినేషన్స్ లోకి ఆమె పేరు తీసుకోవాలంటేనే భయపడిపోతున్నారు. ఎందుకంటే ముసలావిడని టార్గెట్ చేసినట్టు ఉంటుంది, మన ఓటింగ్ మీద దెబ్బ పడుతుంది అని ఆలోచిస్తున్నారు. ఆమె మీద నామినేషన్స్ పాయింట్స్ వేయడానికి కంటెస్టెంట్స్ కి బోలెడన్ని పాయింట్స్ ఉన్నాయి. కానీ వేయలేకపోతున్నారు, రియాలిటీ ని బయటపెట్టలేకపోతున్నారు, రియాలిటీ షోలో రియాలిటీ లేనప్పుడు ఇక అదేమీ షో మీరే చెప్పండి.