https://oktelugu.com/

చివర్లో బిగ్ బాస్ కి ఝలక్ ఇచ్చిన ఆ ఇద్దరు కంటెస్టెంట్స్… కారణం?

రేపే బిగ్ బాస్ సీజన్ 4 గ్రాన్ ఫినాలే. నాగార్జున హోస్ట్ గా… ప్రత్యేక అతిథి సమక్షంలో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. అరియనా, అభిజిత్, సోహైల్, అఖిల్ మరియు హారిక ఫైనల్స్ కి చేరగా, వీరిలో ఒకరు విన్నర్ మరొకరు రన్నర్ కానున్నారు. బిగ్ బాస్ చివరి ఎపిసోడ్స్ నిర్వాహకులు ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. హౌస్ నుండి ఎలిమినేటై వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ అందరినీ హౌస్ లోకి మరలా ప్రవేశపెడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ సభ్యుల రీయూనియన్ […]

Written By:
  • admin
  • , Updated On : December 19, 2020 / 11:45 AM IST
    Follow us on


    రేపే బిగ్ బాస్ సీజన్ 4 గ్రాన్ ఫినాలే. నాగార్జున హోస్ట్ గా… ప్రత్యేక అతిథి సమక్షంలో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. అరియనా, అభిజిత్, సోహైల్, అఖిల్ మరియు హారిక ఫైనల్స్ కి చేరగా, వీరిలో ఒకరు విన్నర్ మరొకరు రన్నర్ కానున్నారు. బిగ్ బాస్ చివరి ఎపిసోడ్స్ నిర్వాహకులు ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. హౌస్ నుండి ఎలిమినేటై వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ అందరినీ హౌస్ లోకి మరలా ప్రవేశపెడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ సభ్యుల రీయూనియన్ పార్టీలు ప్రేక్షకులకు మజా పంచుతున్నాయి.

    Also Read: ప్రేమతో చెబితే వాళ్ళు వింటారు

    మొదటిగా మోనాల్ ఇంటిలోకి రీఎంట్రీ ఇచ్చారు. మోనాల్ వచ్చిన విషయం తెలుసుకున్న అఖిల్ పరుగున వెళ్లి ఆమెను కలుసుకొనే ప్రయత్నం చేశారు. కౌగిలింతలతో రెచ్చిపోదామనుకున్న వీరి ఉత్సహానికి మధ్యలో ఉన్న గ్లాస్ వాల్ బ్రేక్ వేసింది. దీనితో ఫ్లైయింగ్ కిస్సులతో సరిపెట్టుకున్న ఈ జంట… దూరం కావడం వలన నిద్ర కరువైందని చెప్పుకున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి మోనాల్ హౌస్ ని వీడడం జరిగింది. అలాగే కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ కూడా హౌస్ లోకి ఎంటరై సందడి చేశారు. ముఖ్యంగా కుమార్ సాయి… హారిక, సోహైల్ మరియు అఖిల్ పై సరదా పంచ్ లు విసిరారు.

    Also Read: మెగా ఫ్యామిలీ నుండి ‘ఈ కథలో పాత్రలు కల్పితం’

    వీరితో పాటు లాస్య సైతం హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులను సరదా ఆటలు ఆడిస్తూ ఆమె ఎంటర్టైన్ చేశారు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఎలిమినేటైన మిగతా కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఈ రీయూనియన్ పార్టీకి ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రం, డుమ్మా కొట్టారని తెలుస్తుంది. అమ్మ రాజశేఖర్, టీవీ 9 దేవి నాగవల్లి హౌస్ లోకి మరలా రావడానికి నిరాకరించారట. దానికి కారణం వీరిద్దరి ఎలిమినేషన్ విషయంలో అన్యాయం జరిగిందని గట్టిగా భావిస్తున్నారట. ఓటింగ్ కి వ్యతిరేకంగా పక్షపాతంతో వ్యవహరించి… తమను ఎలిమినేట్ చేశారన్న కోపంతో.. బిగ్ బాస్ నిర్వాహకులకు చివర్లో ఝలక్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తుంది.”

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్