https://oktelugu.com/

Ka Collection: కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు..మొదటిరోజు వచ్చిన వసూళ్లు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యింది. థియేట్రికల్ ట్రైలర్ తో పాటు, ఈ స్పీచ్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం ఈ సినిమా ఓపెనింగ్స్ కి ప్లస్ అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు.

Written By:
  • Vicky
  • , Updated On : November 1, 2024 / 03:04 PM IST

    Ka Collection

    Follow us on

    Ka Collection: దీపావళి కానుకగా నిన్న విడుదలైన నాలుగు సినిమాలలో కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రానికి ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు కూడా వచ్చాయి. చిన్న హీరో సినిమా అవ్వడంతో అనేక ప్రధాన నగరాల్లో షోస్ చాలా తక్కువగా వచ్చాయి. ఫలితంగా టాక్ కి తగ్గ వసూళ్లు రాలేదు కానీ, బాక్స్ ఆఫీస్ వద్ద కచ్చితంగా లాంగ్ రన్ ఉండే సినిమా అని అందరికీ నిన్న సాయంత్రమే అర్థమైంది. ఎందుకంటే అత్యధిక ప్రాంతాలలో ‘క’ చిత్రానికి ‘లక్కీ భాస్కర్’, ‘అమరన్’ కంటే ఎక్కువ హౌస్ ఫుల్ షోస్ నమోదు అయ్యాయి. ఒక సినిమాకి జనాల్లో ఎంతటి బలమైన టాక్ ఉంది అనేది ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ ద్వారా మాత్రమే అత్త అవుతుంది. కాబట్టి ‘క’ చిత్రానికి కచ్చితంగా లాంగ్ రన్ ఉంటుందని బల్లగుద్ది మరీ చెప్తున్నారు ట్రేడ్ పండితులు. వరుసగా ‘మీటర్’, ‘రూల్స్ రంజన్’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకున్న కిరణ్ అబ్బవరం కి, ఈ చిత్రం భారీ హిట్ గా నిలబడడం ఆయనలో ఎంతో పాజిటివ్ ఎనర్జీ ని నింపింది.

    ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యింది. థియేట్రికల్ ట్రైలర్ తో పాటు, ఈ స్పీచ్ కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం ఈ సినిమా ఓపెనింగ్స్ కి ప్లస్ అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాము. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ,ఓవర్సీస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకి 6 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. కేవలం నార్త్ అమెరికా లో ప్రీమియర్స్+ మొదటి రోజుకి కలిపి లక్ష డాలర్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే 88 లక్షల రూపాయిల గ్రాస్, 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు అన్నమాట.

    అలాగే నైజాం ప్రాంతం లో కోటి 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆంధ్ర ప్రదేశ్ నుండి కోటి 20 లక్షలు, కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి 40 లక్షలు, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది అంటున్నారు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 15 కోట్ల రూపాయలకు జరిగింది. ఈ వీకెండ్ కి 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టనున్న ఈ సినిమా, ఫుల్ రన్ లో కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసుంటే బాగుండేదని కొందరి అభిప్రాయం. టీజర్, ట్రైలర్ లో పాన్ ఇండియా అని చెప్పారు కానీ, ఎందుకో చివరి నిమిషంలో వెనకడుగు వేశారు.