Homeఎంటర్టైన్మెంట్Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. ఒకప్పుడు బాలీవుడ్ మాస్ యాక్షన్ హీరో గా , మూడు దశాబ్దాలు నెంబర్ 1 గా కొనసాగుతూ సెన్సేషన్ క్రియేట్ చేశారు అమితాబ్. ఇక 2000 దశకం నుండి ఆరోగ్య సమస్యల రీత్యా హీరో పాత్రలకు దూరమై , క్యారెక్టర్ రోల్స్ చేస్తూ, నేటి తరం ఆడియన్స్ కి కూడా ఆయన బాగా దగ్గరయ్యారు. ఆయన కావాలని హీరో రోల్స్ కి దూరం అయ్యారు కానీ , తనలోని వింటేజ్ యాక్షన్ హీరో ఇంకా బ్రతికే ఉన్నాడని కల్కి చిత్రాన్ని చూసినప్పుడు ప్రతీ ఒక్కరికి క్లారిటీ వచ్చింది. ఈ వయస్సులో కూడా ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలను చూసి , నేటి తరం ఆడియన్స్ థియేటర్స్ లో గూస్ బంప్స్ పొందారు.

ఇప్పటికీ ఆయన రోజుకి 18 గంటలు సినిమా కోసం పనిచేస్తూనే ఉన్నారు. ఇకపోతే సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే అమితాబ్ బచ్చన్ , తనకు సంబంధించిన విషయాలను ఎల్లపుడూ పంచుకుంటూనే ఉంటారు. అలా ఆయన లేటెస్ట్ గా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న ఒక సంఘటన , వాళ్ళను తీవ్రమైన ఆందోళనకు గురయ్యేలా చేసింది. ఆయన మాట్లాడుతూ ‘రీసెంట్ గానే నాకు సర్జరీ జరిగింది. కొన్ని రోజులు నేను ICU లో కూడా ఉండాల్సి వచ్చింది. డాక్టర్ల సంరక్షణ కారణంగా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఇంటికి సురక్షితంగా తిరిగి వచ్చాను. కానీ హాస్పిటల్ నుండి తిరిగి వచ్చిన తర్వాత నాకు అసలైన సవాళ్లు ఎదురయ్యాయి. సర్జరీ తర్వాత శరీరం సహకరించే విధానం, కోలుకునే ప్రక్రియ పూర్తిగా మారిపోయింది. ఈ సమయం లో శారీరక నొప్పితో పాటు, తీవ్రమైన మానసిక ఒత్తిడిని కూడా ఎదురుకోవాల్సి వస్తోంది’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఈ ట్వీట్ ప్రస్తుతం అభిమానుల్లో తీవ్రమైన ఆందోళనకు గురయ్యేలా చేస్తోంది. 83 ఏళ్ళ వయస్సులో 18 గంటలు కష్టపడే అమితాబ్ బచ్చన్ , తన ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని , జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అమితాబ్ కి ఇలాంటి సర్జరీలు కొత్తేమి కాదు. ‘కూలీ నెంబర్ 1’ షూటింగ్ సమయం లో అమితాబ్ బచ్చన్ కి ఘోర ప్రమాదం జరిగింది. అభిమానులు ఆయన ప్రాణాలు దక్కుతాయనే ఆశలు కూడా వదిలేసుకున్నారు. అలాంటి ఘోరమైన పరిస్థితి నుండి ఆయన సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత కూడా ఆయనకు ఇలాంటి ఆందోళకరమైన ఆరోగ్య సమస్యలు చాలానే తలెత్తాయి , కానీ వాటిని ఆయన విజయవంతంగా ఎదురుకొని మన ముందు నిలబడ్డారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Oktelugu Epaper
Exit mobile version