Kalki 2 Update: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘కల్కి 2898 AD ‘ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన వసూళ్ల సునామి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ అంచనాల నడుమ , నార్త్ ఇండియా లో షారుఖ్ ఖాన్ ‘డుంకీ’ చిత్రం తో పోటీ పడి మరీ 1100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో కంటే , ఈ సినిమాకు ఓవర్సీస్ లో కాసుల కనకవర్షం కురిసింది. ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రానికి 19 మిలియన్ డాలర్ల గ్రాస్ వచ్చిందంటే ఏ రేంజ్ సెన్సేషన్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా సీక్వెల్ కి ‘బాహుబలి’ సీక్వెల్ కి ఉన్నంత క్రేజ్ ఉంది. ఎందుకంటే స్టోరీ లో ఆ రేంజ్ విషయం ఉంది కాబట్టి.
రీసెంట్ గానే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ని మొదలు పెట్టి , అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ లపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. రెండవ షెడ్యూల్ లో ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నాడు. ఈ సీక్వెల్ లో ప్రధానంగా కర్ణుడి పునర్జన్మ ఎలా జరిగింది అనే దానిపైనే ప్రధానంగా ఉంటుందట. మొదటి భాగం లో ‘మహాభారతం’ ఎపిసోడ్స్ కేవలం 5 నిమిషాలు మాత్రమే చూపిస్తారు. కానీ రెండవ భాగం లో ఏకంగా 30 నిమిషాలకు పైగా చూపిస్తారట. అంటే కురుక్షేత్రం లో అర్జునుడు , కర్ణుడు మధ్య యుద్ధం జరగడం మొత్తం చూపించబోతున్నారు అన్నమాట. మొత్తం కర్ణుడి చుట్టే ఈ సినిమా ప్రధానంగా తిరుగుతుంది కాబట్టి ఈ చిత్రానికి ‘కర్ణ 3102 BC’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది లోనే ఈ టైటిల్ గ్లింప్స్ ని కూడా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట.
ఇక రెండవ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్ , అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొంటారట. ఈ షెడ్యూల్ లో ఇంటర్వెల్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది , అందుకోసం ఒక భారీ సెట్టింగ్ కూడా ఏర్పాటు చేశారట. ప్రభాస్ , అమితాబ్ కలిసి కమల్ హాసన్ తో భీకర యుద్ధం చేసేలా ఈ ఇంటర్వెల్ షాట్ ని డిజైన్ చేశాడట నాగ్ అశ్విన్. అంతే కాదు ఈ చిత్రం లో మహాభారతం లోని మరికొన్ని క్యారెక్టర్స్ కూడా వస్తాయని అంటున్నారు. అందులో భీష్ముడు , పరశురాముడు క్యారెక్టర్స్ కూడా ఉంటాయట. ‘కల్కి’ చిత్రం లో పునర్జన్మ ఎత్తిన కర్ణుడికి గురువు గా దుల్కర్ సల్మాన్ నటించాడు. మహాభారతం లో కర్ణుడికి పరుశురాముడు గురువు అనే సంగతి అందరికీ తెలిసిందే. అంటే రెండవ భాగం లో దుల్కర్ సల్మాన్ ని పరశురాముడిగా చూపించబోతున్నారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.