Amir Khan : ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు అమీర్ ఖాన్(Amir Khan). ఆయన సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన భీభత్సాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడంటే రాజమౌళి రికార్డ్స్ ని రాజమౌళి మాత్రమే బ్రేక్ చేయగలడు అని అనుకుంటున్నాం. కానీ 8 ఏళ్ళ క్రితం వరకు అమీర్ ఖాన్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని కేవలం అమీర్ ఖాన్ మాత్రమే బ్రేక్ చేయగలడు అనే టాక్ ట్రేడ్ లో ఉండేది. అందుకు ఉదాహరణ ‘దంగల్’. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్స్ 2000 కోట్ల రూపాయలకు పైమాటే. బాహుబలి 2 బ్రేక్ చేయలేకపోయింది, రీసెంట్ గా వచ్చిన ‘పుష్ప 2’ కూడా బ్రేక్ చేయలేకపోయింది. దురదృష్టం ఏమిటంటే అమీర్ ఖాన్ సినిమాలు దంగల్ తర్వాత మూడు విడుదల అయ్యాయి. ఆ మూడు కూడా ఈ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేయలేకపోయాయి.
Also Read : ఈడీ విచారణకు మహేష్ బాబు మళ్ళీ డుమ్మా కొట్టాడా..? ఈసారి కారణం ఏమిటంటే!
ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్'(Sitare Zameen Par) అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ‘తారే జమీన్ పర్’ చిత్రానికి ఇది సీక్వెల్. వచ్చే నెల 20 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సమందించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ట్రైలర్ మొత్తం చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించింది. అమీర్ ఖాన్ తన మార్క్ స్టోరీ తో మన ముందుకు రాబోతున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. విచిత్రమైన ఆకారం తో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ ని బాస్కెట్ బాల్ గేమ్ లో నిష్ణాతులను చేసి పోటీలకు పంపే పాత్రలో ఇందులో అమీర్ ఖాన్ కనిపించబోతున్నాడు. ట్రైలర్ చూస్తుంటే మంచి ఎమోషన్ కి స్కోప్ ఉన్న సినిమా లాగా అనిపిస్తుంది కానీ, ఆ ఎమోషనల్ సన్నివేశాలను ట్రైలర్ లో చూపించలేదు.
బహుశా థియేట్రికల్ అనుభూతి బెటర్ గా ఉండడం కోసం దాచి పెట్టి ఉండొచ్చు. ఈ చిత్రం లో హీరోయిన్ గా జెనీలియా నటించింది. చాలా కాలం తర్వాత ఆమె వెండితెర మీద ఒక స్టార్ హీరో సినిమాలో కనిపించబోతుంది ఇది. అయితే అమీర్ ఖాన్ చిత్రమంటే ఎదో ఒక వైవిద్యం ఉంటుంది. ట్రైలర్ తోనే ఆయన తన సత్తా చూపించేవాడు. ఇందులో ఎందుకో ఆ వైవిద్యం మిస్ అయిన అనుభూతి కలిగింది. ఈమధ్య కాలం లో ఇలాంటి ఫ్యాక్టర్స్ లేకపోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా డిజాస్టర్ ఫ్లాప్ అవుతుంది. ఆ ప్రమాదం ఈ సినిమాకు కూడా లేకపోలేదు. మంచి ఫీల్ గుడ్ మూవీ అని అనిపించుకునే స్కోప్ ఈ చిత్రానికి ఉంది. చూడాలి మరి ఎలా తీశారు అనేది. ‘తారే జమీన్ పర్’ చిత్రం ఆడియన్స్ గుండెల్ని పిండేస్తుంది. ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటే అమీర్ ఖాన్ ఈజ్ బ్యాక్ అనొచ్చు.