Ameesha Patel: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఏర్పడుతోంది. ఇక బద్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అమీషా పటేల్ సైతం తెలుగులో మంచి గుర్తింపునైతే సంపాదించుకుంది. ఆమె ఆ సినిమాతో సాధించిన సక్సెస్ ని మరికొన్ని సినిమాలకు కొనసాగిస్తూ తెలుగులో చాలా సంవత్సరాల పాటు తన కెరియర్ ను కొనసాగించింది. ప్రస్తుతం 50 సంవత్సరాల వయసులో ఉన్న ఈ అమ్మడు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఎవరూ ఉండరని చెప్పుకొచ్చింది. హీరోయిన్ అవ్వడానికి ముందు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు తను హీరోయిన్ అవుతానని చెప్పడంతో వాళ్లు అబ్జెక్షన్ చెప్పారని అందువల్లే వాళ్ళని వదిలిపెట్టనని తను చెప్పింది.
Also Read: ‘బ్యూటీ ‘ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా?ఫట్టా?
ఇక ఇప్పుడు 50 సంవత్సరాల వయసులో ఉన్నా కూడా 25 సంవత్సరాల వయసు వాళ్ళు తనతో డేట్ చేయడానికి రెడీగా ఉన్నామని ఎప్పటికప్పుడు తనకు మెసేజ్ లు పెడుతున్నారట. అయినప్పటికి వాళ్ళందరినీ పక్కన పెట్టీ తన పని తను చేసుకుంటున్నాను అని చెప్పింది. ఇప్పటికి తనకు నచ్చిన మెంటాలిటీతో ఉన్నవాడు దొరికితే మాత్రం పెళ్లి చేసుకోవడానికి తన సిద్ధంగా ఉన్నానని చెప్పింది.
మరి ఈ అమ్మడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత పాపులారిటిని సంపాదించుకుందో అంతే తొందరగా కనుమరుగైపోయింది… తెలుగులో పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాలో చేసిన తను, మహేష్ బాబు తో నాని, ఎన్టీఆర్ తో నరసింహుడు లాంటి సినిమాలు చేసింది. నరసింహుడు సినిమా తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలైతే రాలేదు.
దాంతో ఆమె తన మకాన్ని ముంబై కి మార్చేసింది. మరి ఏది ఏమైనా కూడా ఆమె ఇక మీదట సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించాలని చాలా మంది ఆమె అభిమానులు కోరుకుంటున్నారు… చూడాలి మరి మంచి పాత్ర దొరికితే తెలుగులో నటిస్తారా లేదా అనేది…