ముదురు హీరోయిన్ తో రవితేజ రొమాన్స్ !

మాస్ మహా రాజా రవితేజ ‘క్రాక్‘ సినిమా తరువాత ఏ సినిమా చేయాలి ? ఏ డైరెక్టర్ తో చేయాలి అనే మీమాంసలో ఉన్నాడు. ఇప్పటికే రవితేజ డేట్స్ కోసం త్రినాధ్ రావ్, రమేష్ వర్మ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రమేష్ వర్మ సినిమా అయితే రెండు మూడు నెల్లల్లో పూర్తి అవుతుంది. ఎలాగూ రవితేజకు కావాల్సింది కూడా అదేనయ్యే. అందుకే దాదాపు రమేష్ వర్మకే ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ సినిమాలో రవితేజ డబల్ […]

Written By: admin, Updated On : August 9, 2020 6:34 pm
Follow us on


మాస్ మహా రాజా రవితేజక్రాక్‘ సినిమా తరువాత ఏ సినిమా చేయాలి ? ఏ డైరెక్టర్ తో చేయాలి అనే మీమాంసలో ఉన్నాడు. ఇప్పటికే రవితేజ డేట్స్ కోసం త్రినాధ్ రావ్, రమేష్ వర్మ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రమేష్ వర్మ సినిమా అయితే రెండు మూడు నెల్లల్లో పూర్తి అవుతుంది. ఎలాగూ రవితేజకు కావాల్సింది కూడా అదేనయ్యే. అందుకే దాదాపు రమేష్ వర్మకే ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ సినిమాలో రవితేజ డబల్ యాక్షన్ అని.. సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఒక హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిను ఫైనల్ చేసిన చిత్రబృందం, మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను తీసుకోవాలనుకున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

Also Read: హాట్‌ బ్యూటీ.. హారర్ వెబ్‌ సిరీస్‌

కాగా చిత్రబృందం నిధినే ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసేలా ఉంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. దాదాపు ఈ సినిమాలో క్యాస్టింగ్ ఫైనల్ అయింది. కాకపోతే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ఈ సాంగ్ లోని కంటెంట్ ప్రకారం ఒక సీనియర్ హీరోయిన్ కావలి. అంటే సీనియర్ హీరోయిన్ తో రొమాంటిక్ సాంగ్ అన్నమాట. మొదట ఈ సాంగ్ కోసం శ్రీయాను అనుకున్నారు. కానీ శ్రీయా అనగానే వెరీ రొటీన్ గా ఉంటుంది. అందుకే కొత్తగా చేద్దామనే సెన్స్ లో అమీషా పటేల్ ను అప్రోచ్ అయ్యారట. ఎలాగూ ఎవరు ఛాన్స్ ఇస్తారా అని ఎదురు చూస్తోన్న అమీషాకి ఈ ఆఫర్ మంచిందే. అందుకే అడిగిన వెంటనే ఎలాంటి సాంగ్ లోనైనా చేస్తానని చెప్పేసిందట.

Also Read: కరోనా జయించిన బిగ్‌బీ కుటుంబం..

ఇక ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ దాదాపు ముప్పై కోట్లు పెట్టి నిర్మించనున్నారు. ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకురాకపోతే గనుక.. ఇక రవితేజ కూడా జగపతి బాబు, శ్రీకాంత్ లా సైడ్ క్యారెక్టర్స్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ‘డిస్కో రాజా’ రవితేజ మార్కెట్ పై బాగానే దెబ్బ వేసింది. మరి క్రాక్ సినిమాతోనైనా రవితేజ హిట్ అందుకోని, మరో నాలుగేళ్లు హీరోగా కొనసాగాలని కోరుకుందాం.