Ambati Rambabu: ఏపీ రాజకీయాలు రాను రాను దారుణంగా తయారవుతున్నాయి. నాయకుల నోటికి అసలు అడ్డూ అదుపూ ఉండడం లేదు. నోటికెంత మాటొస్తే అంత మాటతో ప్రత్యర్థుల మీద పడిపోతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ వారని తేడా లేదు. నేతల్లో చాలా మంది నోటికొచ్చిన బూతు ప్రేలాపనలతో రెచ్చిపోతున్నారు. అసలు జూ. ఎన్టీఆర్ ఏమి చేశాడు ? రాజకీయాలకు ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు. అయినా ఎన్టీఆర్ పై కామెంట్స్ మాత్రం ఆగడం లేదు.

ఒక్కో ప్రభుత్వ హయాంలో ఒక్కో నేత వీరంగం ఆడడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిపాటిగా మారింది. తన దుందుడుకు ప్రవర్తనతో ఎప్పుడూ వార్తల్లోనే ఉండే అంబటి రాంబాబు.. తాజాగా జూ.ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు, తన డ్రైవర్ను చంపేసి అడ్డంగా దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి మీడియా ముందుకు వచ్చి అడ్డగోలు వ్యాఖ్యలు చేశాడు.
Also Read: Pawan Kalyan with son Akira Nandan: పవన్ ఫ్యాన్స్ కోసం అరుదైన ఫోటో.. ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ !
ఇంతకీ అంబటి ఏమి రంకేశాడు అంటే.. ‘తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. చట్టానికి ఎవరూ అతీతులు కారు. సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎవరైనా చట్టానికి ఒకటే. దీనిపై రాజకీయం చేయడం తగదు’ అంటూ అంబటి చెప్పుకొచ్చాడు. ఇంతటితో ఆగి ఉంటే పద్దతిగా ఉండేది. కానీ, జగన్ ను ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు.. జూనియర్ ఎన్టీఆర్, బోనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుండని టీడీపీ నేతలు ఆశ పడుతున్నారు’ అంటూ అంబటి కామెంట్స్ చేశారు.

దాంతో, అంబటి రాంబాబు పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. అంబటి బూతు పురాణం అంటూ గతంలో అంబటి ఆడియో లీక్ ను తాజాగా సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి అంబటి బూతు ఆడియో కొత్తగా మార్కెట్ లోకి వచ్చినట్టు అయ్యింది. ఈ మధ్య ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ తక్కువగా ఉన్న ఏకైక హీరో ఎన్టీఆరే.
అందుకే, అంబటి ట్రోల్ నేషనల్ రేంజ్ లో వైరల్ అవుతుంది. అయితే, అంబటి రాంబాబు ప్రాసలో మాట్లాడుతూ ఏదో మాట జారలేదు. కావాలనే ఆయన జూ.ఎన్టీఆర్ పేరు తీశారు. వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకాలు హైలైట్ అయ్యితే, తమ పార్టీకి నష్టం కాబట్టి.. ఈ టాపిక్ డైవర్ట్ చేయాలి కాబట్టి.. తెలివిగా ఎన్టీఆర్ పై కామెంట్స్ చేసాడు. ఆయన పాచిక కొంతమేరకు బాగానే పారింది.
Also Read:Mehreen Pirzada: ఆ ఆశ నిరాశ అవుతుందో..? లేక, సక్సెస్ అవుతుందో ?
Recommended videos
[…] […]