https://oktelugu.com/

Rajasekhar: రాజశేఖర్ తో అమెజాన్ ప్రైమ్ షాకింగ్ డీల్… భారీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం!

దెయ్యం, శేఖర్ అనే రెండు చిత్రాలు చేశాడు. ఇవి ఎప్పుడు వచ్చి పోయాయో కూడా తెలియదు. హీరో రాజశేఖర్ కి క్యారెక్టర్, విలన్ రోల్స్ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం.

Written By:
  • S Reddy
  • , Updated On : April 22, 2024 / 04:02 PM IST

    Amazon Prime shocking deal with Rajasekhar

    Follow us on

    Rajasekhar: సీనియర్ హీరో రాజశేఖర్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. చూస్తుంటే హీరోగా ఆయన కెరీర్ ముగిసిన భావన కలుగుతుంది. గరుడవేగ చిత్రం తర్వాత ఆయనకు హిట్ లేదు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన గరుడ వేగ మంచి విజయం సాధించింది. అనంతరం కల్కి టైటిల్ తో క్రైమ్ థ్రిల్లర్ చేశాడు. హనుమాన్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కల్కి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా ఆడలేదు.

    దెయ్యం, శేఖర్ అనే రెండు చిత్రాలు చేశాడు. ఇవి ఎప్పుడు వచ్చి పోయాయో కూడా తెలియదు. హీరో రాజశేఖర్ కి క్యారెక్టర్, విలన్ రోల్స్ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. నితిన్ హీరోగా గత ఏడాది విడుదలైన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో రాజశేఖర్ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన జైలులో ఖైదీగా కనిపించారు.

    హీరోగా ఆఫర్స్ లేని రాజశేఖర్ వద్దకు ఓకే క్రేజీ ప్రపోజల్ వెళ్లిందట. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ రాజశేఖర్ తో ఒక డీల్ చేసుకుందట. రూ. 50-60 కోట్ల బడ్జెట్ తో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నారట. రాజశేఖర్ హీరోగా నటిస్తున్నారట. ఈ చిత్రానికి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తారట. ఓ కథను సిద్ధం చేసుకున్న గ్యారీ బీహెచ్ అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులకు వినిపించారట. వాళ్లకు కథ నచ్చడంతో ప్రాజెక్ట్ ఓకే చేశారట.

    ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు రాజశేఖర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారట. రాజశేఖర్ తో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు ఈ చిత్రంలో నటిస్తారట. ఈ మేరకు ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆఫర్స్ లేక ఖాళీగా ఉన్న రాజశేఖర్ కి ఇది గోల్డెన్ ఛాన్స్ అనడంలో సందేహం లేదు. రెమ్యునరేషన్ కూడా గట్టిగా ముట్టే అవకాశం కలదు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.