https://oktelugu.com/

Radhe Shyam Movie Highlights: ‘రాధేశ్యామ్’ మూవీలో అద్భుత హైలెట్స్.. ప్రధాన లోపాలేంటో తెలుసా?

Radhe Shyam Movie Highlights: రాధేశ్యామ్ మూవీ విడుదలై ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. యువత, కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ నీట్ లవ్ స్టోరీని చూడడానికి థియేటర్లకు పోటెత్తాయి. దీంతో తొలి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. బాముబలి, సాహోల తర్వాత ప్రభాస్ నటించిన ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. ప్యాన్ ఇండియా లెవల్ లో విడుదలైన ఈ మూవీని చూసిన ప్రేక్షకులు ఇది హాలీవుడ్ రేంజ్ సినిమా అని కొనియాడుతున్నారు. ఇక రాధేశ్యామ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 11, 2022 / 03:11 PM IST
    Follow us on

    Radhe Shyam Movie Highlights: రాధేశ్యామ్ మూవీ విడుదలై ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. యువత, కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ నీట్ లవ్ స్టోరీని చూడడానికి థియేటర్లకు పోటెత్తాయి. దీంతో తొలి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. బాముబలి, సాహోల తర్వాత ప్రభాస్ నటించిన ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. ప్యాన్ ఇండియా లెవల్ లో విడుదలైన ఈ మూవీని చూసిన ప్రేక్షకులు ఇది హాలీవుడ్ రేంజ్ సినిమా అని కొనియాడుతున్నారు.

    Radhe Shyam Movie Highlights

    ఇక రాధేశ్యామ్ చూసిన ప్రేక్షకులు, పలువురు క్రిటిక్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. ప్రధానంగా రాధేశ్యామ్ లోని ప్రధాన హైలెట్స్ యూరప్ లోని ఇటలీలో షూట్ చేసిన అందమైన లోకేషన్స్ అని కితాబిస్తున్నారు. ఇదో విజువల్ వండర్ అని చెబుతున్నారు. ఇక హాలీవుడ్ స్టైల్ మేకింగ్ సినిమాను విజువల్ వండర్ గా మారిందని ప్రశంసిస్తున్నారు.

    Also Read:   వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ : ‘రాధేశ్యామ్’ ఫస్ట్ డే కలెక్షన్స్

    ఇక సినిమాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం అని కొనియాడుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ప్రేక్షకులు ఫిదా అవ్వడం గ్యారెంటీ అంటున్నారు. ఇక అన్నింటికంటే సినిమాలో క్లైమాక్స్ లోని ‘షిప్ ఎపిసోడ్’ సినిమాకే హైలెట్ అంటున్నారు.

    ఇక రాధేశ్యామ్ మూవీలోని ప్రధాన లోపాలను ఒకసారి గమనిస్తే.. ప్రభాస్ నుంచి ఎక్స్ పెక్ట్ చేసే యాక్షన్ సీన్స్ లేకపోవడం ప్రధాన మైనస్ గా చెప్పొచ్చు. సెపరేట్ కామెడీ ట్రాక్ లేదని.. సినిమాలో కామెడీకి స్కోప్ లేదని పెదవి విరుస్తున్నారు.

    Radhe Shyam

    సినిమాల్లో ఒక్క ఫైట్ కూడా లేకపోవడం ప్రధానమైనస్ అంటున్నారు. అంత పెద్ద ప్రభాస్ ను పెట్టి బాహుబలి చూశాక ప్రభాస్ తో ఫైట్ లేకపోవడాన్ని ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోవడం లేదు. కానీ అంతిమంగా సినిమా అయితే బోర్ కొట్టదని చెబుతున్నారు. క్లాస్ ప్రేక్షకులకు, ఓవర్సీస్ వాళ్లకే నచ్చే సినిమా అంటున్నారు. పూర్తి టాక్ బయటకు వస్తే కానీ ఏ విషయం తెలియదు.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ ‘ఎత్తర జెండా’ అదిరిపోతోందట

     

    Tags