
ఆర్జీవీ.. ఈ పేరు వింటే ఒకప్పుడు వైవిధ్యం… ఇప్పుడు మాత్రం వివాదాస్పదంతో కూడుకున్న బూతుమయం. ఆడియన్స్ బలహీనతలనే డబ్బు చేసుకోవాలనే.. దర్శకుడిగా నెట్టుకొస్తోన్న రాంగోపాల్ వర్మ, మొత్తానికి బూతు సినిమాలతోనే నాలుగు డబ్బులు చేసుకుంటున్నాడు. పైగా అందర్నీ బొలోమని తన దారిలోనే రమ్మని కోరుకుతున్నాడు. రాజమౌళికి డైరెక్ట్ గానే నన్ను ఫాలో అవ్వు అని ఉచిత సలహా పడేసినా.. వర్మను మాత్రం విషయం లేని బ్యాచ్ మాత్రమే ఫాలో అవుతుంది.
Also Read: ‘సన్ ఆఫ్ ఇండియా’గా మోహన్ బాబు
కెరీర్ స్టార్టింగ్ లో దర్శకుడు మారుతి ఈ రోజుల్లో, బస్ట్ స్టాప్ అనే బూతు సినిమాలు తీసి మంచి సక్సెస్ కొట్టాడు. దాంతో బూతు సినిమాలకు డబ్బులు వచ్చేస్తున్నాయని తామరతంపరగా అదే తరహా సినిమాలు తీశారు. వాటికి పోస్టర్ డబ్బులు కూడా రాలేదు. ఇప్పుడు ఆర్జీవీ ఓ కొత్త బూతు మార్గాన్ని కనిపెట్టాడు. నాలుగైదు లక్షల్లో మినీ సినిమా చుట్టేసి.. ఆన్ లైన్ లో రెండు వందల టికెట్ రేటు పెట్టి.. కుర్రాళ్ళను టార్గెట్ చేస్తూ ట్రైలర్స్ ను వదిలి మొత్తానికి డబ్బులు సంపాదిస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఈ ఆన్ లైన్ థియేటర్ కాన్సెప్ట్ ను చాలా మంది మొదలుపెట్టబోతున్నారు.
Also Read: పవన్ సినిమా పై ఫ్యాన్స్ లో ఆందోళన !
కేవలం ఆర్జీవీని చూసి చాలా మంది ఔత్సాహికులు, కరోనా టైమ్ లో కూడా ఏదోకటి చుట్టేసి డబ్బులు సంపాధించాలని.. ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు చేస్తున్నారు. చివరికి ఆ సినిమాల పరిస్థితి.. ఆ సినిమాల్లోని కంటెంట్ యూట్యూబ్ లో కూడా ఎవ్వరు చూడరు. అయినా ఇలాంటి సినిమాల పరంపర ఆగట్లేదు. కరోనా దెబ్బకు ఖాళీగా వున్న ఔత్సాహిక సినిమా టెక్నీషియన్లు తమ శ్రమను పెట్టుబడిగా పెట్టి ఇలాంటి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆ సినిమాల్లో బూతు కంటెంట్ మాత్రమే ఉంటుందనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. కానీ వాటికీ డబులు రావని కూడా ఎలాంటి అనుమానం అక్కర్లేదు.