Amardeep: గత బిగ్ బాస్ సీజన్ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి ఎపిసోడ్ నుండే ప్రేక్షకులను గత సీజన్ ఎంతగానో ఆకర్షించింది. ఆ సీజన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణమైన కంటెస్టెంట్స్ లో ఒకరు అమర్ దీప్. శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, ఈ ముగ్గురి మధ్యనే బిగ్ బాస్ సీజన్ నడించింది, మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ సైడ్ క్యారెక్టర్స్ అన్నట్టుగా జనాల్లోకి వెళ్ళింది. అమర్ దీప్ టైటిల్ విన్నర్ అవుతాడని అందరూ అనుకున్నారు కానీ, చివరి వారంలో జరిగిన ఒక సంఘటన కారణంగా అమర్ దీప్ నుండి పల్లవి ప్రశాంత్ చేతుల్లోకి టైటిల్ వెళ్ళిపోయింది. అమర్ దీప్ రన్నర్ గా మిగిలిపోయాడు. అయితే ఇప్పుడు ఎలా అయినా టైటిల్ గెలవడానికి మరోసారి ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.
నీతోనే డ్యాన్స్ మొదటి సీజన్ లో పాల్గొన్న అమర్ దీప్, ఆ సీజన్ టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చిన అమర్ దీప్, రెండవ సీజన్ లో ఎలా అయినా టైటిల్ గెలవాలి అనే పట్టుదలతో అడుగుపెట్టి టైటిల్ గెలుచుకొని వెళ్ళాడు. ఇప్పుడు బిగ్ బాస్ 8 లోకి కూడా ఆయన అందుకే ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అమర్ దీప్ వస్తే కచ్చితంగా బిగ్ బాస్ లో మార్పులు వస్తుంది. అతని ఎంటర్టైన్మెంట్ టాలెంట్ తో హౌస్ మొత్తాన్ని ఎల్లప్పుడూ సందడి వాతావరణంలో ఉంచగలడు. అందుకే టీం ఆయనని సంప్రదించినట్టు తెలుస్తుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆయన హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. వాస్తవానికి ముందుగా అమర్ దీప్ కి బదులుగా ఆయన భార్య తేజస్విని గౌడ ‘బిగ్ బాస్ 8’ లోకి రావాల్సి ఉంది. కానీ ఆమె ఎందుకో నెగటివిటీ కి భయపడి ఈ సీజన్ లో పాల్గొనేందుకు ఇష్టపడలేదు. ఇప్పుడు ఆమెకి బదులుగా అమర్ పాత కంటెస్టెంట్స్ జాబితాలో హౌస్ లోకి రాబోతున్నాడు. అయితే అమర్ దీప్ తో పాటు మరో ముగ్గురు పాత కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు.
వాళ్ళు ఎవరంటే శోభా శెట్టి,నయని పావని మరియు యాంకర్ రవి. రవి ని బిగ్ బాస్ టీం సంప్రదించారు కానీ, ఆయన వచ్చేందుకు అంగీకారం తెలపలేదని విశ్వసనీయ వర్గాల నుండి తెలుస్తుంది. దీని గురించి పూర్తి క్లారిటీ రావాలి ఉంది. అలాగే రాబోయే వారాల్లో అంజలి పవన్ , రీతూ చౌదరి వంటి వారు కూడా హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లేందుకు నామినేట్ అయిన ఇంటి సభ్యులు బెజవాడ బేబక్క, నాగ మణికంఠ, విష్ణు ప్రియా, శేఖర్ బాషా, సోనియా. వీరిలో సోనియా లేదా బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.