Amaran Movie Review: అమరన్ ఫుల్ మూవీ రివ్యూ…

ఆర్మీ ఆఫీసర్ గా దేశానికి ఎనలేని సేవలను అందించిన ముకుంద్ వరదరాజన్ ఆర్మీలో ఎలాంటి ఆపరేషన్ చేశాడు. అలాగే ఫ్యామిలీతో తను ఎలా స్పెండ్ చేశాడు ముఖ్యంగా ఆర్మీలో ఆయన సాధించిన విజయాలు ఏంటి తన ఫ్యామిలీ లైఫ్ ని కోల్పోవడం వల్ల ఆయనకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనే కథాంశానికి కొంచెం ఫిక్షన్ స్టోరీ ని కూడా ఆడ్ చేసి ఈ సినిమాని తెరకెక్కించారు.

Written By: Gopi, Updated On : October 31, 2024 11:59 am

Amaran Movie Review

Follow us on

Amaran Movie Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యభరితమైన సినిమాలను తీయడంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు శివ కార్తికేయన్… గతంలో ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథంశామైతే ఉంటుంది. ఈయన్ని డిఫరెంట్ కేటగిరీకి చెందిన హీరోగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఆయన ‘అమరన్’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్మీ ఆఫీసర్ అయిన ‘ముకుంద్ వరదరాజన్’ జీవిత కథను ఆధారంగా చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఆర్మీ ఆఫీసర్ గా దేశానికి ఎనలేని సేవలను అందించిన ముకుంద్ వరదరాజన్ ఆర్మీలో ఎలాంటి ఆపరేషన్ చేశాడు. అలాగే ఫ్యామిలీతో తను ఎలా స్పెండ్ చేశాడు ముఖ్యంగా ఆర్మీలో ఆయన సాధించిన విజయాలు ఏంటి తన ఫ్యామిలీ లైఫ్ ని కోల్పోవడం వల్ల ఆయనకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనే కథాంశానికి కొంచెం ఫిక్షన్ స్టోరీ ని కూడా ఆడ్ చేసి ఈ సినిమాని తెరకెక్కించారు… అయితే చివరికి ముకుంద్ వరదరాజన్ ఎలాంటి సక్సెస్ ని సాధించాడు అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు రాజకుమార్ పెరియాసామి ఈ సినిమాను నిజజీవితం ఆధారంగా తెరకెక్కించాడు. కాబట్టి క్యారెక్టర్ లో ఎక్కడా కూడా డివియేషన్ కి వెళ్లకుండా ఒరిజినల్ కథను కథగా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. నిజానికి ఆయన రాసుకున్న కొన్ని ఎలివేషన్ సీన్స్ అయితే సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయనే చెప్పాలి. ఇక అలాగే స్క్రీన్ ప్లే లో కూడా తాను వైవిధ్యమైన ఎలిమెంట్స్ ని వాడుతూ వచ్చినప్పటికి ఇంకా కొంచెం బెటర్ గా స్క్రీన్ ప్లే రాసుకోవచ్చు అనిపించింది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆయన ఒక ఇంటెన్స్ డ్రామాని క్రియేట్ చేశాడు.

అలాగే ఎమోషన్స్ తో కూడా ఆడుకున్నాడనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ చేసిన ఆయన సెకండాఫ్ లో మాత్రం ఎమోషన్స్ ను బాగా వాడుకున్నాడు. నిజానికైతే ఆర్మీ ఆఫీసర్స్ అనగానే మనందరికీ ఏదో ఒక తెలియని ఎమోషన్ అయితే ఉంటుంది. మనందరి కోసం బార్డర్ లో యుద్ధం చేస్తున్న సైనికుల మీద మనకి ఎప్పుడు రెస్పెక్ట్ అయితే ఉంటుంది. ఇక ఆ విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తూ మనందరిని ఒక డిఫరెంట్ లోకంలోకి తీసుకెళ్లడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యారు…

ఇక జీవి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలావరకు హైలైట్ అయింది. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లో ప్రతి ప్రేక్షకుడి చేత కంటతడి పెట్టించడంలో జీవి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి… ఇక దర్శకుడు సీన్ టు సీన్ సినిమాను ప్రజెంట్ చేసిన విధానం ప్రేక్షకుడికి చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే నటుడు శివ కార్తికేయన్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఇక ఇంతకుముందు సినిమాల్లో తను ఎలాగైతే తన నట విశ్వరూపాన్ని చూపించేవాడో, ఈ సినిమాలో అంతకుమించి అనేలా నటించి మెప్పించాడు… ఇక అతని వైఫ్ క్యారెక్టర్ లో సాయి పల్లవి ఒక డీసెంట్ పెర్ఫామెన్స్ ని ఇచ్చింది. ముఖ్యంగా భర్త బోర్డర్లో ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకునే విధానం గాని ఆమె స్టెబుల్ గా నిలబడే ఒక ధైర్యం గాని, ఆమె చెప్పే డైలాగులు గాని సినిమా థియేటర్లో చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. ముఖ్యంగా ఆమె డీసెంట్ పెర్ఫామెన్స్ కి ప్రతి ప్రేక్షకుడు మంత్రముగ్ధులవుతాడనే చెప్పాలి. ఇక వీళ్లతో పాటుగా రాహుల్ బోస్, భువన్ అరోరా ల యాక్టింగ్ కూడా సినిమాకి చాలా వరకు ప్లేస్ అయింది. ఇక మిగిలిన ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించేలా నటించారు…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాలో జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ చాలా వరకు ప్లస్ అయింది. సిచువేషన్ కి తగ్గట్టుగా ఇన్స్ట్రుమెంట్స్ ని వాడుతూ మ్యూజిక్ లో చేసిన ఎక్స్పరిమెంట్స్ చాలా బాగా హైలెట్ అయ్యాయనే చెప్పాలి. ఇక విజువల్స్ కూడా ఈ సినిమాకి చాలా యాప్ట్ గా కుదిరాయి. ముఖ్యంగా సీన్లో ఉన్న మూడు ని చెడగొట్టకుండా సినిమాటోగ్రాఫర్ ఈ సినిమాకి ఒక మంచి విజువల్స్ అయితే అందించారనే చెప్పాలి. ఇక వార్ నేపథ్యంలో సాగే సీన్స్ కి విజువల్స్ అయితే టాప్ నాచ్ లో ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

కథ
శివ కార్తికేయన్, సాయి పల్లవి యాక్టింగ్
డైరెక్షన్

మైనస్ పాయింట్స్

సెకండాఫ్ కొంచెం స్లో అయింది.
స్క్రీన్ ప్లే కొంచెం బెటర్ గా రాసి ఉంటే బాగుండేది…

రేటింగ్

ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5

చివరి లైన్
దేశభక్తి సినిమా కాబట్టి అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా…