YS Vijayamma: వైఎస్ విజయమ్మ లేఖ.. సాక్షి అక్కసు.. వైసీపీ ఆగ్రహం.. ఆస్తుల గొడవ ఎక్కడిదాకా వెళ్తుందో?!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి - షర్మిల కు సంబంధించిన ఆస్తుల వివాదం రోజురోజుకు సరికొత్త మలుపులు తీసుకుంటున్నది. వైఎస్ షర్మిల - విజయమ్మ పై ఎన్సీఎల్టీ లో జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేయడం.. దానికి కౌంటర్ గా షర్మిల లేఖ రాయడం.. విజయమ్మ కూడా ఓ లేఖాస్త్రాన్ని సంధించడం వంటివి వెంట వెంటనే జరిగిపోయాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : October 31, 2024 11:47 am

YS Vijayamma

Follow us on

YS Vijayamma: షర్మిల లేఖ రాసినప్పుడు విపరీతంగా స్పందించిన వైసిపి, సాక్షి.. ఇప్పుడు విజయమ్మ సంధించిన లేఖాస్త్రం పై కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నాయి. ఏకంగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోసం విజయమ్మ కుట్ర పన్నుతున్నారని సాక్షి ఆరోపించింది. విజయమ్మ రాసిన లేఖలో జగన్ బెయిల్ రద్దు అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించింది.. వాస్తవానికి నాలుగు గోడల మధ్య ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉండగా.. ఎన్సీ ఎల్టీ దాకా తీసుకెళ్లడం సరికొత్త వివాదాలను రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారం వైయస్ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.. సామాజిక మద్యమాలలో వారు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు..” జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల, విజయమ్మ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. షర్మిల పాదయాత్ర చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత షర్మిలకు జగన్ సముచిత ప్రాధాన్యం కల్పించలేదు.. ఇప్పుడు ఆస్తుల వివాదం తెరపైకి వచ్చింది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే పార్టీ పరువు పోతోంది. ఇప్పటికైనా ఈ సమస్యను వారు పరిష్కరించుకోవాలని” వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యానిస్తున్నారు.

ఊహించని పరిణామం

జగన్ – షర్మిల ఆస్తుల వివాదంలో విజయమ్మ లేఖ రాయడం ఒకరకంగా సంచలనం సృష్టించింది. ఇది వైసిపి కి షాక్ కలిగించింది. దీంతో సాక్షి రెచ్చిపోయింది. ఏకంగా వైఎస్ విజయమ్మ తీరును విమర్శిస్తూ ఒక పేజీ మొత్తం కథనాలను ప్రచురించింది. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు గురైనప్పుడు విజయమ్మ రోడ్లమీదకి వచ్చారు. ఆందోళన చేశారు. జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ములాఖత్ సమయంలో చెప్పినట్టు విజయం చేశారు. శాసనసభలో బొత్స సత్యనారాయణ తో కూడా నానా మాటలు పడ్డారు. అయితే అలాంటి విజయమ్మను సాక్షి విమర్శించింది. సాక్షి అలా రాసింది అంటే, జగన్ సమ్మతం లేకుండా ఉండదు. మొత్తంగా చెప్పాలంటే ఆస్తుల వివాదంలో జగన్.. షర్మిల, విజయమ్మతో యుద్ధాన్నే కోరుకున్నట్టు తెలుస్తోంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు కాని.. ప్రస్తుతం అయితే ఆస్తుల వివాదం జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో సరికొత్త చిచ్చు రేపింది. ఆయనను చెల్లికి, తల్లికి దూరం చేసింది. షర్మిల భర్త అనిల్ కుమార్ పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎవరి మాటా వినరని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే జగన్ ఏకాకి అయిపోయారని.. త్వరలోనే ఆయన కేసుల ఒత్తిడిని ఎదుర్కోబోతున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

 

YS Vijayamma(1)