Paradise Movie First Review: సినిమా ఇండస్ట్రీకి సోలోగా వచ్చి సక్సెస్ లను సాధించి స్టార్ హీరోగా ఎదగడం అనేది అంత ఆశామాషీ వ్యవహారం కాదు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి వర్కౌట్ అయింది. ఆ తర్వాత రవితేజ కూడా అలానే సోలోగా వచ్చి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం నాని సైతం అదే బాటలో నడుస్తున్నాడు. ఇప్పటికే నాని స్టార్ హీరోగా అవతరించడానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు… ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నానికి చాలా గొప్ప స్థానం ఉంది. ప్రస్తుతం ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రానటువంటి కథతో ఈ సినిమా తెరకెక్కుతుందట. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.
తద్వారా నానికి గానీ శ్రీకాంత్ ఓదెలకు గాని ఈ సినిమా ఎలాంటి గుర్తింపును తీసుకురాబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఈ సినిమాకి సంబంధించిన కొన్ని రషెష్ అయితే చూశారట.
దానిని చూసిన ప్రతి ఒక్కరు సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంది అంటూ కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని జడల్ క్యారెక్టర్ లో అదరగొట్టాడట. ఇప్పటి వరకు మనం నానిని మునుపెన్నడు చూడని విధంగా కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో నాని బడుగు బలహీన వర్గాల వారి పట్ల నిలిచి వాళ్లకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అందించే ఒక పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఆ పాత్రలో నాని ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఫస్ట్ రివ్యూ విషయంలో మేకర్స్ తోపాటు సినిమాని చూసిన సెలబ్రిటీలు సైతం కొంతవరకు సంతృప్తితో ఉన్నారట. ఇక ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది…