HomeతెలంగాణRevanth Reddy : మెట్రోను కేంద్రానికి ముడిపెట్టిన రేవంత్ రెడ్డి కథ.. ఎంత ముందు చూపో..

Revanth Reddy : మెట్రోను కేంద్రానికి ముడిపెట్టిన రేవంత్ రెడ్డి కథ.. ఎంత ముందు చూపో..

Revanth Reddy  : హైదరాబాద్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న మెట్రో రెండో దశ పనులకు ముహూర్తం వచ్చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండో దశ పనులకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఇప్పుడు రెండో దశలో భాగంగా 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టనుంది. ఇందుకోసం ప్రభుత్వం జీవో 196ని జారీ చేసింది. రెండో విడత మెట్రో రైలు ప్రాజెక్టు వ్యయం రూ.24,269 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.7,313 కోట్లను వెచ్చిస్తోంది. ఇప్పటికే నగరంలో కొత్తగా 5 మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు చేపట్టనున్నారు.

కారిడార్ 4లో నాగోలు-శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలోమీటర్లు, కారిడార్ 5లో రాయదుర్గ-కోకాపేట వరకు 11.6 కిలోమీటర్లు, కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, కారిడార్ 7లో మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4కిలోమీటర్లు, కారిడార్ 8లో ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7.1 కిలోమీటర్లు నిర్మించనున్నారు. మొత్తంగా రెండో దశలో 116.4 కిలోమీటర్లు ఈ రైలు మార్గాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించారు. మొదటగా పార్ట్ ఏ కింద 76.4 కిలోమీటర్ల మార్గానికి పరిపాలన అనుమతులు మంజూరైనట్లు, పార్ట్ బిలో నిర్మించనున్న శంషాబాద్ విమనాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్ల మార్గానికి సర్వే జరుగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక హైదరాబాద్‌లో మెట్రో ఏర్పాటైనప్పటి నుంచి రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రెండో దశ కూడా అందుబాటులోకి వస్తే మరో 8 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

మెట్రో మొదటి దశ పూర్తయి చాలా కాలం కాగా.. ఇప్పటివరకూ రెండో దశ అడుగు ముందుకు పడలేదు. హైదరాబాద్ నగరంలో చాలా పరిమిత ప్రాంతాల వరకే మెట్రో విస్తరించి ఉంది. దీంతో ట్రాఫిక్ కొంత వరకు మాత్రమే తగ్గింది. ప్రజావసరాలను తీర్చేందుకు పూర్తిస్థాయిలో ఉపయోగపడలేదు. అందుకే.. రేవంత్ సర్కార్ రెండో విడతకు శ్రీకారం చుట్టింది. దీంతో శివారు ప్రాంతాలకూ మెట్రో విస్తరించనుంది. దీంతో మహానగరానికి మరింత గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే.. రెండో విడత కోసం తెలంగాణ ప్రభుత్వం 30 శాతం నిధులు సమకూరుస్తోంది. 18 శాతం నిధులను కేంద్రం ఇస్తోంది. మిగిలిన నిధులను రుణాలు, పీపీపీ పద్ధతిలో సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెండో దశ మీద ఎంతో కాలంగా ఆశలు పెట్టుకున్నప్పటికీ పరిపాలన అనుమతులు రాలేదు. కానీ.. తాజాగా ప్రభుత్వం అన్ని అనుమతులు జారీ చేసింది. ఎలాగూ కేంద్రం కూడా సహకరిస్తుండడంతో రెండో దశ పనులు వెంటనే ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కేంద్రంతోనూ సఖ్యతగానే ఉంటుండడంతో.. కేంద్రం కూడా సహకరించేందుకు ముందుకు వస్తున్నది. మొత్తంగా రెండో దశ మెట్రో కూడా పనులు పూర్తయితే ఇటు ప్రయాణికులకు మరింత ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. అటు విశ్వనగరం ఖ్యాతి కూడా మరింత పెరగనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version