Amaran Collections: ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో కంటెంట్ ని మించిన సూపర్ స్టార్ ఎవ్వరూ లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు, చిన్న హీరోల సినిమాలకు చాలా వ్యత్యాసం ఉండేది. కానీ ఇప్పుడు అది మారిపోయింది, ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేని ముఖాలు ఉన్న హీరోలు కూడా ఈమధ్య కాలం లో 200 కోట్లు, 400 కోట్లు అవలీల గా కొట్టేస్తున్నారు. మన మార్కెట్ పరిధి పాన్ ఇండియా దాటి, పాన్ వరల్డ్ వరకు వెళ్లడం వల్లే ఇలాంటి వసూళ్లు వస్తున్నాయి. తమిళనాడు ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరో గా నటించిన ‘అమరన్’ మూవీ పరిస్థితి ఇందుకు మరో ఉదాహరణ. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రానికి మొదటిరోజు నుండే ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేశారు. ట్రేడ్ పండితులు అందిస్తున్న విశ్లేషణల ప్రకారం ఈ చిత్రం ఈ ఏడాది విడుదలైన విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’, సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వెట్టియాన్’ ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటేస్తుందని అంటున్నా0రు. నాలుగు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూళ్లను వరల్డ్ వైడ్ గా రాబట్టిందో ఒకసారి చూద్దాం.
ముందుగా తెలుగు వెర్షన్ వసూళ్ల విషయానికి వస్తే, శివ కార్తికేయన్ కాస్త మన ఆడియన్స్ కి పరిచయం ఉన్న హీరోనే కాబట్టి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 5 కోట్ల రూపాయలకు జరిగింది. మొదటి రోజు నుండి నాల్గవ రోజు వరకు రెండు కోట్ల రూపాయలకు తగ్గకుండా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి నాలుగు రోజుల్లో 9 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే నాలుగు రోజుల్లోనే ఈ సినిమాకి 4 కోట్ల 20 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట. అదే విధంగా గ్రాస్ వసూళ్లు 15 కోట్ల 45 లక్షలు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడు లో నాలుగు రోజుల్లో 65 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక లో 8 కోట్ల రూపాయిలు కేరళ లో నాలుగు కోట్ల 50 లక్షల రూపాయిలు గ్రాస్ వసూళ్లు వచ్చింది.
ఇక ఓవర్సీస్ లో అయితే విజయ్ , రజినీకాంత్ సినిమాలతో సమానంగా నాలుగు రోజుల్లో 42 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే రోజుకి పది కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వచ్చిందట. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 136 కోట్ల రూపాయిల గ్రాస్, 67 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరగగా, నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి 30 లక్షల రూపాయిల లాభం వచ్చింది. ఇక నుండి లాభాలే లాభాలు. కమల్ హాసన్ కి నిర్మాతగా ఇది రెండవ అతి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు. కేవలం బాక్స్ ఆఫీస్ హిట్ మాత్రమే కాకుండా, ఇండియన్ సినిమా చిరకాలం గుర్తించుకోదగ్గ క్లాసిక్ గా అమరన్ నిల్చింది.