https://oktelugu.com/

Pallavi Prashanth: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ మోసం… అమాయకంగా నటిస్తూ!

తాను టైటిల్ కొడితే ప్రైజ్ మనీ తన ప్రాంతంలో గల పేద రైతులకు దానంగా ఇస్తానని పల్లవి ప్రశాంత్ హామీ ఇచ్చాడు. నెలలు గడుస్తున్నా పల్లవి ప్రశాంత్ చెప్పినట్లు ప్రైజ్ మనీ పంచలేదు.

Written By: , Updated On : April 15, 2024 / 09:53 AM IST
Pallavi Prashanth expose is a fraud

Pallavi Prashanth expose is a fraud

Follow us on

Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఒక సంచలనం. హౌస్లో తన ఆట తీరుతో ప్రేక్షకుల మనసులు గెలిచాడు. ఎవరూ ఊహించని విధంగా సామాన్యుడు హోదాలో హౌస్లో అడుగుపెట్టి టైటిల్ విన్నర్ అయ్యాడు. ఒక కామనర్ టైటిల్ విన్నర్ కావడం ఇదే తొలిసారి. టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి టైటిల్ అందుకున్నాడు. రైతుబిడ్డ ట్యాగ్ అతనికి కలిసొచ్చింది. అదే సమయంలో ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానని చెప్పడం జనాలు నమ్మి ఓటు వేశాడు.

తాను టైటిల్ కొడితే ప్రైజ్ మనీ తన ప్రాంతంలో గల పేద రైతులకు దానంగా ఇస్తానని పల్లవి ప్రశాంత్ హామీ ఇచ్చాడు. నెలలు గడుస్తున్నా పల్లవి ప్రశాంత్ చెప్పినట్లు ప్రైజ్ మనీ పంచలేదు. దీనిపై విమర్శలు వినిపించాయి. ప్రైజ్ మనీ రావడానికి లేటు అయ్యింది. ప్రాణం పోయిన ఇచ్చిన మాట తప్పను అని పల్లవి ప్రశాంత్ అన్నాడు. ఎట్టకేలకు ఒక లక్ష రూపాయలు దానం చేశాడు. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారుల పేరిట లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.

ఇది జరిగి నెల రోజులు దాటిపోయింది. పల్లవి ప్రశాంత్ మరో సహాయం చేయలేదు. ఆ ఊసు కూడా ఎత్తడం లేదు. పైగా సహాయం కోసం ఎవరూ నా ఇంటికి రావద్దు. పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టొద్దని పల్లవి ప్రశాంత్ అన్నాడు. బహుమతులు మినహాయిస్తే… పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ రూపంలో రూ. 35 లక్షలు గెలుచుకున్నాడు. ఇందులో టాక్స్ కటింగ్స్ కి పోను రూ. 16 లక్షలు మిగులుతాయని సమాచారం. ఈ మొత్తం పల్లవి ప్రశాంత్ పేద రైతులకు పంచాల్సి ఉంది.

ఇప్పటి వరకు లక్ష రూపాయలు మాత్రమే పంచాడు. మరలా సైలెంట్ అయ్యాడు. దాంతో పల్లవి ప్రశాంత్ సహాయం విషయంలో మోసం చేశాడనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ సోషల్ మీడియా విమర్శలపై పల్లవి ప్రశాంత్ ఎలా స్పందిస్తాడో చూడాలి. మరోవైపు పల్లవి ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జరుగుతుంది. తనకు ఆసక్తి కూడా ఉందని పల్లవి ప్రశాంత్ ఓ సందర్భంలో చెప్పాడు. త్వరలో తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. పల్లవి ప్రశాంత్ పోటీ చేస్తాడేమో చూడాలి…