Samantha Directorial Debut: అనారోగ్యంతో చాలా కాలం వరకు సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకున్న సమంత(Samantha Ruth Prabhu), రీసెంట్ గానే రీ ఎంట్రీ ఇస్తూ నిర్మాతగా ‘శుభమ్’ చిత్రం ద్వారా భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా సమంత తొలిప్రయత్నం లోనే సక్సెస్ అయ్యింది అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా లో గర్వంగా చెప్పుకున్నారు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఇక నుండి సినిమాల సంఖ్య బాగా తగ్గిస్తానని, ఆరోగ్యం పై ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఇలా అనడం తో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే వెండితెర పై ఆమె ఒకప్పటి లాగా ఫుల్ యాక్టీవ్ గా ఉండకపోవచ్చు కానీ, తెరవెనుక మాత్రం మంచి యాక్టీవ్ ఉండడానికి ప్రయత్నం చేస్తుంది.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమాని రిజెక్ట్ చేసిన అనుపమ పరమేశ్వరన్..కారణం ఏమిటంటే!
పూర్తి వివరాల్లోకి వెళ్తే త్వరలోనే సమంత దర్శకురాలిగా మారబోతుందట. తాను స్థాపించిన ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ లోనే ఈ సినిమాని తెరకెక్కిస్తుందట. ‘శుభమ్’ చిత్రం లాగానే ఈ సినిమాలో కూడా సాధ్యమైనంత వరకు కొత్త వాళ్ళే ఉంటారని, వాళ్ళతో పాటు కాస్త పేరున్న నటీనటులు కూడా ఈ చిత్రం లో భాగం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియచేయనుంది అట సమంత. నటిగా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ కోట్లాది మంది అభిమానుల ఆదరాభిమానాలను సంపాదించుకున్న సమంత, ఇప్పుడు నిర్మాతగా సక్సెస్ అవ్వడమే కాకుండా, డైరెక్టర్ గా కూడా సక్సెస్ సాధించి తన సత్తా చాటేందుకు సిద్ధం అవుతుండడం తో ఆమె అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. కానీ సమంత హీరోయిన్ గా ఏడాదికి కనీసం ఒక్క సినిమాలో అయినా కనపడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే సమంత ఇప్పుడు హీరోయిన్ రేంజ్ ని ఎప్పుడో దాటేసింది.
Also Read: కారులో కూర్చొని బోరుమని ఏడ్చేసిన అనుపమ పరమేశ్వరన్..కారణం ఏమిటంటే!
అనుష్క మరియు నయనతార లాగా సమంత నుండి కూడా ఆమె ఫ్యాన్స్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే ఆశిస్తున్నారు. రీసెంట్ గానే ఈమెకు అల్లు అర్జున్, అట్లీ చిత్రం లో విలన్ క్యారక్టర్ చేసే అవకాశం దక్కింది. గతం లో కూడా ఈమె సూపర్ డీలక్స్, ఫ్యామిలీ సీజన్ 2 లలో విలన్ క్యారెక్టర్స్ చేసి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. అందుకే డైరెక్టర్ అట్లీ ఆమెని సంప్రదించాడు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల సమంత ఆ క్యారక్టర్ ని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఆమె స్థానం లో రష్మిక నటిస్తుంది. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం లో నటిస్తుంది. ఈ సినిమాని స్వయంగా ఆమెనే నిర్మిస్తుంది కూడా. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు నెట్ ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ‘రక్త బ్రహ్మాండ’ అనే భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.