War 2 Day 9 Worldwide Collection: ఈ ఏడాది ట్రేడ్ పరంగా బయ్యర్స్ ని చావు దెబ్బ కొట్టిన చిత్రాల్లో ఒకటి ‘వార్ 2′(War 2 Movie). ఈ సినిమా కేవలం తెలుగు లో మాత్రమే పెద్ద ఫ్లాప్ అయ్యింది అనుకుంటే పొరపాటే. తెలుగు లో 50 కోట్ల రూపాయిల నష్టాన్ని తీసుకొస్తే, హిందీ లో 100 కోట్ల రూపాయిల నష్టాన్ని చేకూర్చింది. స్పై యూనివర్స్ హిస్టరీ లో ఈ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ ని ఇప్పటి వరకు చూడలేదంటూ అక్కడి ట్రేడ్ పండితులు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా అంత పెద్ద డిజాస్టర్ అవ్వాల్సినది కాదు, సినిమా యావరేజ్ రేంజ్ లోనే ఉంది. కానీ కథలో కొత్తదనం లేకపోవడమే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే నిన్న గాక మొన్న విడుదలైనట్టు అనిపిస్తున్న ఈ చిత్రం అప్పుడే 9 రోజులు పూర్తి చేసుకుంది.
Also Read: హృతిక్ రోషన్ హిస్టరీ గురించి ఎన్టీఆర్ కి తెలియదా..? అలా ఎలా నోరు జారాడు?
నేడు, రేపు వీకెండ్ అవ్వడం ఈ చిత్రానికి కాస్త కలిసొచ్చే అంశం. ఈ రెండు రోజులు కారణంగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్రతికిపోదు. తెలుగు లో ఎప్పుడో చనిపోయింది, హిందీ లో కొనఊపిరి తో ఉంది. అలా కొనఊపిరి తో ఉన్న హిందీ వసూళ్లకు కాస్త బూస్ట్ ని ఇస్తుంది అంతే. అయితే 9 రోజుల్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూళ్లను రాబడుతుందో చూద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 37 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. 9వ రోజు ఈ చిత్రానికి 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. అది దాదాపుగా అసాధ్యమే. ఇక హిందీ వెర్షన్ వసూళ్లను చూస్తే ఇప్పటి వరకు ఈ చిత్రం 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
Also Read:కూలీ, వార్ 2 చూసేవాళ్ళకి రాజమౌళి సర్ ప్రైజ్?
నెట్ వసూళ్లు దాదాపుగా 220 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. వాస్తవానికి ఇది డీసెంట్ రేంజ్ వసూళ్లే, కానీ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 400 కోట్ల రూపాయలకు పైగా అన్ని వెర్షన్స్ కి కలిపి నెట్ వసూళ్లు రావాలి. ప్రస్తుతానికి దేవుడు దిగి వచ్చినా అది సాధ్యం అవ్వదు. ఈ వీకెండ్ లో ఎంత వసూళ్లు వస్తే అంత వసూళ్లను రికవర్ చేసుకొని ఇక ఈ సినిమా దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొట్టమొదటిసారి స్పై యూనివర్స్ లో ఒక సినిమా భారీ డిజాస్టర్ ఫ్లాప్ కి గురి కావడం తో ఇక మీదట స్పై యూనివర్స్ లో సినిమాలు రావడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు.