Paradaa Movie PublicTalk: నేటి తరం యూత్ ఆడియన్స్ విపరీతంగా ఇష్టపడే హీరోయిన్స్ లో ఒకరు అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) . కేరళ ప్రాంతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ కూడా మన తెలుగు అమ్మాయి లాగా కనిపించడం ఈమె స్పెషాలిటీ. అచ్చ తెలుగు అమ్మాయి లాగా ఎంతో పద్దతి గా కనిపిస్తుంది కాబట్టి ఈమెని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఇష్టపడుతుంటారు. ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాలను ఒకసారి పరిశీలిస్తే, అన్నిట్లోనూ ఆమె నటనకు అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చింది అనే విషయం అర్థం అవుతుంది. రీసెంట్ గా ఆమె ‘పరదా'(Paradaa Movie) అనే చిత్రం చేసింది. ఇది అనుపమ పరమేశ్వరన్ మొట్టమొదటి లేడీ ఓరియెంటెడ్ సినిమా అనుకోవచ్చు. రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుండి మంచి రేటింగ్స్ వచ్చాయి. ఈ సినిమా విడుదలకు ముందు ఆమె అనేక ప్రొమోషన్స్ లో భాగాంగా అనేక ఇంటర్వూస్ ఇచ్చింది.
Also Read: ‘టిల్లు స్క్వేర్’ ని అనుపమ అయిష్టంగానే చేసిందా..? సంచలనం రేపుతున్న లేటెస్ట్
ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘సాధారణంగా నేను కెమెరా ముందు నటించేటప్పుడు నా పాత్రలో ఎంత లీనమై ఉంటానో, కెమెరా ఆఫ్ అయ్యాక నేను పూర్తిగా నా క్యారక్టర్ ని మర్చిపోయి నిజ జీవితం లోకి వచ్చేస్తాను. కానీ ఈ సినిమాకు అలా ఉండలేకపోయాను. నా పాత్ర ఇందులో ఆత్మహుతి చేసుకున్న సన్నివేశం, ఆ సన్నివేశానికి ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నన్ను వెంటాడుతూనే ఉంది. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కారులో కూర్చొని ఏడ్చేసాను. ఇలాంటి అనుభవం నాకు కెరీర్ లో ఇదే తొలిసారి. సోషల్ మీడియా లో కొంతమంది ‘పరదా’ ఓవై ని చూసి ఇది పురుషులకు వ్యతిరేకంగా ఉన్న సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు. అది చూసి నాకు చాలా బాధగా అనిపించింది. కానీ ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఏ సినిమాని అయినా మనం చూసే ద్రుష్టి కోణాన్ని బట్టి ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్.
Also Read: పవన్ కళ్యాణ్ సినిమాని రిజెక్ట్ చేసిన అనుపమ పరమేశ్వరన్..కారణం ఏమిటంటే!
ఇక పరదా విషయానికి వస్తే ఈ చిత్రానికి క్రిటిక్స్ నుండి మంచి రేటింగ్స్ వచ్చాయి కానీ, ఆడియన్స్ నుండి మాత్రం రెస్పాన్స్ అంతంత మాత్రం గానే ఉంది. కనీస స్థాయి ఓపెనింగ్ వసూళ్లు కూడా ఈ చిత్రానికి రాలేదు. అనేక చోట్ల బయ్యర్స్ కి పెట్టిన డబ్బుల్లో పావు శాతం కూడా రాలేదు. అనుపమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిల్చింది ఈ చిత్రం. సినిమా కాన్సెప్ట్ బాగుంది కానీ, దానిని నడిపించే తీరు బాగాలేదని, ఎదో బలవంతంగా ఒక అంశాన్నయి జనాల మీదకు రుద్దినట్టుగా అనిపిస్తుంది అంటూ ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు చెప్తున్నారు.