https://oktelugu.com/

Amala Paul: ఆ సీన్స్ లో నటించేందుకు ఎక్కువ డిమాండ్ చేస్తున్న… అమలాపాల్

Amala Paul: కింగ్ నాగార్జున వరుస సినిమాలతో దూసుకుపోతూ యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఆయన ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇటీవలే ” ఘోస్ట్ ” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ‘ గరుడ వేగ ’ చిత్రంతో ప్రవీణ్ సత్తారు అందరి దృష్టిని ఆకర్షించగా… ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 23, 2021 / 11:19 AM IST
    Follow us on

    Amala Paul: కింగ్ నాగార్జున వరుస సినిమాలతో దూసుకుపోతూ యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. ఆయన ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇటీవలే ” ఘోస్ట్ ” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ‘ గరుడ వేగ ’ చిత్రంతో ప్రవీణ్ సత్తారు అందరి దృష్టిని ఆకర్షించగా… ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    ఈ సినిమాలో మొదట కాజల్ ను హీరోయిన్ గా తీసుకోగా … వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ మేరకు కాజల్ ప్లేస్ ను భర్తీ చేసేందుకు ” అమలాపాల్ ” ని హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. ఈ మూవీ స్టోరీ లో భాగంగా నాగ్ – అమలపాల్ మధ్య రొమాంటిక్ సీన్లు ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తుంది. ఓ హిల్ స్టేషన్ ప్రాంతంలో ప్రవీణ్ ఈ సన్నివేశాలని చిత్రికరించబోతున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ సన్నివేశాల్లో నాగార్జునతో అమలాపాల్ లిప్ లాక్ సీన్ కూడా ఉండగా… అందుకు ఆమె అదనపు రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట. దీంతో నిర్మాతలు కూడా ఆమె కండిషన్ కి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక అమలాపాల్ నటించిన ‘ఆమె’ చిత్రంలో న్యూడ్ గా నటించి అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

    మరోవైపు నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రంలో కూడా నటిస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది.
    బంగార్రాజు సినిమాలో అక్కినేని నాగచైతన్య కూడా నటించడం విశేషం. నాగ్ సరసన రమ్యకృష్ణ, చైతూకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు.