Niharika Fires On Anchor Pradeep: మెగా బ్రదర్ నాగబాబు(Nagababu Konidela) కూతురు నిహారిక కొణిదెల(Niharika Konidela) కు టాలీవుడ్ లో ప్రముఖ హీరోలతో, యాంకర్లతో మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. వారిలో యాంకర్ ప్రదీప్(Pradeep Machiraju) కూడా ఒకరు. వీళ్లిద్దరి మధ్య స్నేహం ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ, ఒకరిని ఒకరు తిట్టుకునేంత చనువు ఉందని రీసెంట్ గా విడుదలైన ‘సర్కార్ 5’ ప్రోమో చూసిన తర్వాతే తెలిసింది. సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ గేమ్ షో లోని రాబోయే ఎపిసోడ్ లో ప్రదీప్, నిహారిక కొణిదెల,నవదీప్(Navadeep), చాందిని చౌదరి(Chandini Chowdary) పాల్గొన్నారు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. చాలా కాలం తర్వాత సుధీర్, ప్రదీప్ కాంబినేషన్ ని చూసి ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈటీవీ లో ఢీ షో లో వీళ్లిద్దరి కాంబినేషన్ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి.
Also Read: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ… విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చా?
సర్కార్ మొదటి మూడు సీజన్స్ కి యాంకర్ గా ప్రదీప్ నే వ్యవహరించాడు. గత రెండు సీజన్స్ నుండి ఆయన స్థానం లో సుడిగాలి సుధీర్ కొనసాగుతున్నాడు. సుధీర్ యాంకరింగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ఒక ప్రశ్నకు నిహారిక సమాధానం చెప్పలేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రశ్న ఏమిటంటే ‘పవన్ కళ్యాణ్ గారితో రెండు సార్లు కంటే ఎక్కువ నటించిన హీరోయిన్ పేరు ఏమిటి?’. ఈ ప్రశ్నకు నిహారిక సమాధానం చెప్పలేక, ప్రదీప్ కి స్వాప్ చేస్తుంది. ప్రదీప్ టక్కుమని శృతి హాసన్ పేరు చెప్తాడు. అప్పుడు నిహారిక పైకి లేచి నీ అబ్బా..నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్తావా అని ప్రదీప్ పై సరదాగా మండిపడుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో రేణు దేశాయ్ తో కాకుండా, ఎక్కువ సార్లు కలిసి నటించిన హీరోయిన్ శృతి హాసన్. ‘గబ్బర్ సింగ్’ తో మొదలైన ఈ జంట, ఆ తర్వాత ‘కాటమరాయుడు’ , ‘వకీల్ సాబ్’ వరకు కొనసాగింది. వీటిల్లో ‘కాటమరాయుడు’ మినహా, మిగిలిన రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యాయి. ఈ చిన్న ప్రశ్నకు కూడా నిహారిక సమాధానం చెప్పలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. అభిమానులు ఈ విషయం లో ఆమె అసంతృప్తి గా ఉన్నారు. అలా ఈ ప్రోమో మొత్తం చాలా ఫన్నీ గా సాగిపోయింది. వచ్చే శనివారం ఆహా యాప్ లో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
