https://oktelugu.com/

సంక్రాంతి రేసులో ‘అల్లుడు అదుర్స్’

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా చిత్రం ‘అల్లుడు అదుర్స్’. ఈ మూవీ షూటింగు కరోనా ఎఫెక్ట్ తో గతంలోనే నిలిచిపోయింది. తాజాగా ఈ మూవీ షూటింగు హైదరాబాద్లో ప్రారంభమైంది. సోమవారం ఈ చిత్రంలోని పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. షూటింగులో బెల్లకొండ శ్రీనివాస్ తోపాటు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొన్నాడు. వీరిద్దరిపై సన్నివేశాలు తీసినట్లు సమాచారం. Also Read: పెళ్లికి సిద్ధమవుతున్న రేష్మి.. కాబోయే భర్త ఎవరో తెలుసా? ‘అల్లుడు అదుర్స్’ మూవీని సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2020 / 12:08 PM IST

    alludu adurs

    Follow us on


    బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా చిత్రం ‘అల్లుడు అదుర్స్’. ఈ మూవీ షూటింగు కరోనా ఎఫెక్ట్ తో గతంలోనే నిలిచిపోయింది. తాజాగా ఈ మూవీ షూటింగు హైదరాబాద్లో ప్రారంభమైంది. సోమవారం ఈ చిత్రంలోని పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. షూటింగులో బెల్లకొండ శ్రీనివాస్ తోపాటు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొన్నాడు. వీరిద్దరిపై సన్నివేశాలు తీసినట్లు సమాచారం.

    Also Read: పెళ్లికి సిద్ధమవుతున్న రేష్మి.. కాబోయే భర్త ఎవరో తెలుసా?

    ‘అల్లుడు అదుర్స్’ మూవీని సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ‘కందీరీగ’ మూవీతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీలో బెల్లకొండ శ్రీనివాస్ కు జోడీగా నభానటేష్.. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఈ మూవీని సుబ్రమణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు.

    ఈ సందర్భంగా నిర్మాత సుబ్రమణ్యం మాట్లాడుతూ ఇప్పటికే ‘అల్లుడు అదుర్స్’ టైటిల్.. ఫస్టు లుక్కుకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. ఈ సినిమా టీజర్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపాడు. సంక్రాంతి కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తున్నట్లు ప్రకటించాడు.

    Also Read: కృతిశెట్టికి బర్తేడ్ గిప్ట్ ఇచ్చిన ‘ఉప్పెన’ టీమ్

    ‘అల్లుడు అదుర్స్’ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సోనూసుద్.. వెన్నల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ తొలి చిత్రం ‘అల్లుడు శ్రీను’ మంచి విజయం సాధించింది. ఇటీవలే ‘రాక్షసుడు’ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. మరోసారి ‘అల్లుడు’ సెంటిమెంట్ తో బెల్లకొండ శ్రీనివాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ బెల్లంకొండకు ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి..!