Prabhas Rama Look: ప్రస్తుతం అభిమానుల ట్రెండ్ నడుస్తోంది. హీరోలు బాగానే ఉంటారు. కానీ మధ్యలో అభిమానులు తన్నుకుంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరోనే అంటూ ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకోవడం కొత్తేమీ కాదు. గతంలో నుంచి కూడా ఇదే సంప్రదాయం సాగుతోంది. ఇటీవల ప్రభాస్ నటించిన ఆదిపురుష్ లో రాముడి గెటప్ లో ప్రభాస్ ఎలా ఉన్నాడని ఆయన అభిమానులు పోస్టర్ పెట్టారు. దీనిపై రాంచరణ్ అభిమానులు స్పందించి సెటైర్లు వేశారు. ప్రభాస్ కు ఆ గెటప్ ఏమి బాగా లేదంటూ కామెంట్లు చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ హర్టయ్యారు. మీ హీరోదేంటి పెద్ద గొప్ప అంటూ ఎదురు కామెంట్లు పెట్టారు. దీంతో రెండు అభిమాన సంఘాల మధ్య పోస్టర్ల వార్ నడుస్తోంది.

రాంచరణ్ అభిమానులు అల్లూరి సీతారామరాజు గెటప్ లో మా హీరో ఎలా ఉన్నాడో చూడండి అంటూ రాంచరణ్ ఫొటోను షేర్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేగింది. హీరోలేమో స్నేహంగా ఉంటారు. అభిమానులేమో ఆగ్రహంగా ఉంటారు. ఇప్పుడు ఎవరిది తప్పు. ఎందుకింత ఆగ్రహం. ఎవరి పనులు వారు చేసుకుంటే సరిపోయేదానికి మా హీరో గొప్ప అంటే కాదు మా హీరో గొప్ప అని తగవులు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం.
రాముడి గెటప్ అయినా రావణుడి వేషం అయినా వారి బతుకు దెరువు కోసం వేస్తున్నారు. అంతే కాని వేలం వెర్రి అన్నట్లు అభిమానులు మధ్యలో ఎందుకు దూరడమనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ మేరకు ట్విట్టర్ లో వార్ నడుస్తోంది. అటు ప్రభాస్, ఇటు రాంచరణ్ అభిమానుల పోస్టులకు రెచ్చిపోయి మరీ స్పందిస్తున్నారు. ఇలాగే కొనసాగితే రెండు వర్గాల మధ్య గొడవలు చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకుంటున్నారు. హీరోల ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తూ ఫ్యాన్స్ ఇలాంటి వ్యవహారాలు చేయడంపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వీరి పోస్టులు వైరల్ అవుతున్నాయి. పోటాపోటీగా వారు చేసే షేర్లకు అందరు కంగుతింటున్నారు. అభిమానమంటే ఇంత దరిద్రంగా ఉంటుందా అని పలువురు తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇద్దరు హీరోలు రాముడి పాత్రలో నటించడంతో వారి మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. మా హీరో అంటే కాదు మా హీరోనే సూపర్ అనే వాదనలు చేస్తున్నారు. ఆదిపురుష్ ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో అందులో రాముడి గెటప్ లో ప్రభాస్ కనిపించడం విశేషం. అసలు విషయం ఏంటంటే ప్రభాస్, రాంచరణ్ ఇద్దరిది ఒకే ఊరు మొగల్తూరు. ఒక ఊరి వారిని అభిమానులు ఇలా విడగొట్టేందుకు ప్రయత్నించడం బాగా లేదని పలువురు విమర్శిస్తున్నారు.