Allu Arvind: సినిమాల టికెట్ల విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద చిత్రాలకు పెద్ద రేట్లు పెంచుతూ పోతే జనం థియేటర్లకు రావడం లేదు. దీంతో చిన్న సినిమాలు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ రాజమౌళిది కావడంతో దానికి ప్రేక్షకులు బాగానే వచ్చారు. దీంతో వారు టికెట్ల ధరలు అమాంతం పెంచుకోవడంతో వారి టార్గెట్ నిండింది. కేజీఎఫ్ -2 కూడా అదే దారిలో నడిచింది. ఇవి ప్రత్యేకమైన సినిమాలు కావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా సినిమాలు సక్సెస్ బాట పట్టాయి. నిర్మాతలకు కనకవర్షం కురిపించాయి. కానీ ప్రస్తుతం చిన్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది.

ఈ నేపథ్యంలో వచ్చిన ఎఫ్3 మూవీ కూడా కలెక్షన్లు రాబట్టలేకపోతోంది. సర్కారు వారి పాట బాగుందనే టాక్ వచ్చినా పెరిగిన ధరలతో ప్రజలు థియేటర్ల వైపు రావడం లేదు. ఫలితంగా కలెక్షన్లు తగ్గుతున్నాయి. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంతో సినిమాల భవితవ్యం గందరగోళంగా మారుతోంది. దీనిపై నిర్మాత అల్లు అరవింద్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, రాంచరణ్ నటించిన ఆచార్య బాక్సాఫీసు వద్ద నిలబడలేకపోయింది. దీనికి కారణం సినిమా బాగా లేదనే టాక్ రావడమే. కానీ టికెట్ల రేట్ల విషయంలో మాత్రం చేసిన తప్పులే సినిమాల మనుగడకు ప్రమాదంగా పరిణమిస్తున్నాయి.
Also Read: Box office winner Major: ఎఫ్3, సర్కారువారిపాట, ‘మేజర్’.. బాక్సాఫీస్ విజేత ఎవరంటే?
ఎఫ్ 2 విడుదలైనప్పుడు టికెట్ల ధరలు పెంచకుండానే ఉంచారు. దీంతో కలెక్షన్లు బాగా వచ్చాయి. హిట్ టాక్ కూడా సొంతం చేసుకుంది. కానీ ఎఫ్ 3కి కూడా టికెట్ల ధరలు పెంచకుండానే నిర్మాత నిర్ణయం తీసుకున్నా ప్రేక్షకులు థియేటర్ల వైపు రావడం లేదు. దీనికి కూడా కారణం ఉంది. మూడు నెలల్లో సినిమా ఓటీటీలో వస్తుండటంతో కుటుంబం ఎందుకులే డబ్బులు దండగ ఇంట్లో కూర్చుని ఇంటిల్లి పాది చూడొచ్చు కదా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఆహా, ఓటీటీ స్థాపించింది కూడా అల్లు అరవిందే కావడం గమనార్హం. అందుకే ఆయన స్థాపించినవే ఆయనకు ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారుతున్నాయి.

ఓటీటీ సమయం పెంచాల్సి ఉందని చెబుతున్నారు. మూడు నెలల్లో అయితే జనం థియేటర్ల వైపు వచ్చే అవకాశాలే కనిపించడం లేదు. అందుకే వీటి కాలపరిమితి ఆరు నెలలకు పెంచితేనే ప్రజలు టాకీస్ ల వైపు వస్తారు. దీంతో కలెక్షన్లు పెరుగుతాయి. సినిమా కూడా హిట్ అనే టాక్ సొంతం చేసుకుంటుంది. దీనికి అందరు సహకరిస్తేనే సాధ్యం అవుతుంది. భవిష్యత్ దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకోకతప్పదు. వాటిని అమలు చేస్తేనే సినిమాలకు మనుగడ ఉంటుంది. మొత్తానికి అల్లు అరవింద్ తన స్ట్రాటజీని అమలు చేసేందుకు ఎంత సమయం తీసుకుంటారో తెలియడం లేదు. కానీ ఆయన అనుకున్నది మాత్రం చేసేందుకు వెనకాడరని తెలుస్తోంది.
Also Read:Father Harassed Daughter: కన్న కూతురే.. కానీ అతడు కసాయి తండ్రి? చివరకు ఏమైంది?
[…] […]