Vikram Box Office Collections: ఖైదీ మరియు మాస్టర్ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన లోకేష్ కనకరాజ్, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన చేసిన విక్రమ్ సినిమా ఇటీవలే విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..చాలా కాలం తర్వాత కమల్ హాసన్ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు అంటే, అది లోకేష్ కనకరాజ్ కి కమల్ హాసన్ మీద ఎంత అభిమానం తో ఈ సినిమాని తీసాడో అర్థం చేసుకోవచ్చు..మన టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ సినిమా ఎలాంటి కంబ్యాక్ ఫిలిం గా నిలిచిందో..కమల్ హాసన్ కి విక్రమ్ సినిమా కూడా అదే రేంజ్ కంబ్యాక్ ఫిలిం గా చెప్పుకోవచ్చు..కేవలం తమిళం లో మాత్రమే కాదు..ఈ సినిమా విడుదల అయినా అన్ని బాషలలో కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తుంది..ఇక టాలీవుడ్ లో అయితే దశావతారం సినిమా తర్వాత కమల్ హాసన్ సినిమాకి జనాలు ఈ రేంజ్ లో ఎగబడి చూడడం దీనికే జరిగింది.

ఇది ఇలా ఉండగా లాభాల్లో కూడా ఈ సినిమా సరికొత్త రేర్ ఫీట్ ని అందుకుంది అనే చెప్పాలి..తెలుగు లో ఈ సినిమా రైట్స్ మొత్తాన్ని హీరో నితిన్ ఆరు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు..అయితే ఆయన పెట్టిన ఆరు కోట్ల రూపాయిలను ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రాబట్టి ఈరోజు నుండి లాభాల్లోకి అడుగుపెట్టింది..
Also Read: Allu Arvind: టికెట్ల విషయంలో అల్లు అరవింద్ వాదన సరైనదేనా?

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తూ ఉంటె నితిన్ పెట్టిన ఆ ఆరు కోట్ల రూపాయిలు కేవలం నైజం ప్రాంతం నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ట్రేడ్ వర్గాల అంచనా..కేవలం ఆరు కోట్ల ప్రీ రిలీజ్ జరిగిన ఈ సినిమాకి ఫుల్ రన్ లో కేవలం తెలుగు వెర్షన్ నుండి 18 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ లో వినిపిస్తున్న మాట..ఇక ఈ సినిమా తమిళ్ వెర్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు..కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ఫుల్ రన్ లో ఈ సినిమా కచ్చితం గా తమిళ్ టాప్ 5 గ్రాస్ సాధించిన సినిమాలలో ఒక్కటిగా నిలుస్తుంది అని అంచనా.
Also Read:Reserve Bank of India: కరెన్సీ నోట్లపై గాంధీ ఫొటో మారుస్తారా?
[…] Also Read: Vikram Box Office Collections: విక్రమ్ సినిమాకి వచ్చిన ల… […]
[…] Also Read:Vikram Box Office Collections: విక్రమ్ సినిమాకి వచ్చిన ల… […]