https://oktelugu.com/

Game changer : గేమ్ చేంజర్ విషయంలో దిల్ రాజు కి నష్టం తప్పేలా లేదా..? ఈ మూవీ సేఫ్ జోన్ లో ఉండాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే మొదట మనకు మెగా ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఈ ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు. కాబట్టి ఆయన స్టార్ హీరోగా అవతరించడమే కాకుండా మెగా ఫ్యామిలీని కూడా సినిమా ఇండస్ట్రీకి తీసుకువచ్చి తనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : December 24, 2024 / 08:48 AM IST

    Game changer

    Follow us on

    Game changer : మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గ్లోబల్ స్టార్ గా అవతరించి ప్రస్తుతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకుంటున్నాడు. ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఆ తదుపరి చేసిన గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటే మాత్రం రామ్ చరణ్ భారీ విజయాన్ని సాధించిన హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు. లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ అనేది భారీగా డౌన్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి సూపర్ సక్సెస్ అవుతుంది అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…

    ఇక ఇదిలా ఉంటే దిల్ రాజు మాత్రం ఈ సినిమా విషయంలో కొంతవరకు ఆంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే ఈ సినిమా మీద దాదాపు 600 కోట్ల వరకు కేటాయించిన దిల్ రాజు ఇప్పటివరకు తన కెరియర్లోనే అత్యంత ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా చెబుతున్నాడు. తద్వారా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తే సేఫ్ జోన్ లో ఉంటాడు.

    అలాగే భారీ వసూళ్లను రాబట్టిన సినిమాగా గేమ్ చేంజర్ సినిమా అతని బ్యానర్ లోనే చాలా గొప్ప సినిమాగా నిలిచిపోతుంది. అలా కాదని ఒకవేళ తేడా కొడితే మాత్రం గేమ్ చేంజర్ విషయంలో దిల్ రాజు భారీగా నష్టాన్ని చవిచూడాల్సిన అవకాశమైతే ఉంది. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనుకున్న దిల్ రాజు ఈ సినిమాతో పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని 800 కోట్ల నుంచి 1000కోట్ల వరకు కలెక్షన్లను రాబడితేనే ఆయన సేఫ్ జోన్ లో ఉంటాడు. లేకపోతే ఫైనాన్షియర్లకు ఫైనాన్స్ లను చెల్లించగా అతనికి మిగిలేది ఏమీ ఉండదనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    మరి ఏది ఏమైనా కూడా దిల్ రాజు ఈ సినిమాని చాలా ప్రస్టేజియస్ గా తీసుకున్నాడు. కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని అతను తన కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు.ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…