Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం ఎంత జటిలమైన పరిస్థితులను ఎదురుకుంటున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ కెరీర్ ని రిస్క్ లో పడేలా చేస్తుందా? అంటే, జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అదే అయ్యేట్టు ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై చాలా సీరియస్ గా ఉన్నాడు. పోలీసులు కూడా అల్లు అర్జున్ ని అంత తేలికగా వదిలేలా లేరు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో ఆరోజు రాత్రి ఏమి జరిగిందో వివరిస్తూ మాట్లాడిన మాటలకు, అల్లు అర్జున్ కౌంటర్ ఎటాక్ గా ప్రెస్ మీట్ పెట్టకపోయుంటే బాగుండేది. ప్రెస్ మీట్ పెట్టడం వల్ల సమస్య ఇంకా తీవ్రమైంది. పోలీసులు ఆరోజు రాత్రి జరిగిన ఘటనపై సంబంధించిన ఆధారాలు సేకరించి, సీసీటీవీ వీడియో ప్రూఫ్స్ తో మీడియా కి విడుదల చేసారు. ఇది చూసిన తర్వాత ఎవ్వరైనా పోలీసుల మాటలను నమ్మకుండా ఉండలేరు.
కోర్టు కూడా ఈ వీడియో చూసిన తర్వాత అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. అల్లు అర్జున్ ని ఈ సమస్య నుండి బయటపెడేయడానికి ఆయన మామ గారు చంద్ర శేఖర్ రెడ్డి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. నేడు ఆయన హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్ష్యుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలవడానికి ప్రయత్నం చేసారు. దీపాదాస్ మున్షీ చంద్ర శేఖర్ రెడ్డి తో మాట్లాడకుండానే వెళ్ళిపోయింది. దీంతో నిరాశకి గురైన చంద్ర శేఖర్ రెడ్డి గాంధీ భవన్ నుండి వెనుతిరిగారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియా తో మాట్లాడుతూ ‘మేము ప్రెస్ మీట్ లో ఉండగా అల్లు అర్జున్ మామయ్య చంద్ర శేఖర్ రెడ్డి వచ్చారు. ఆ తర్వాత బయటకి వెళ్లిన తర్వాత నాతో ఫోన్లో మాట్లాడారు. మళ్ళీ కలుస్తానని చెప్పారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
దీనిని బట్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లు అర్జున్ విషయమై చంద్ర శేఖర్ రెడ్డి తో మాట్లాడేందుకు సుముఖత చూపించడం లేదని సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే నెల 12వ తేదీతో అల్లు అర్జున్ కి ఇచ్చిన ఇంటెర్మ్ బెయిల్ గడువు ముగుస్తుంది. ఆయనకీ ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వస్తుందా లేదా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. రెగ్యులర్ బెయిల్ వస్తే ఏ సమస్య లేదు, ఒకవేళ రాకపోతే మాత్రం అల్లు అర్జున్ జైలుకి వెళ్లాల్సిందే. కాంగ్రెస్ పార్టీ అతన్ని జైలుకు పంపేందుకే గట్టి ప్రయత్నాలు చేస్తుందని సోషల్ మీడియా లో వినిపిస్తున్న గుసగుసలు. మరి ఈ సస్పెన్స్ కి తెరపడాలంటే జనవరి 12 వరకు ఎదురు చూడాల్సిందే.
బ్రేకింగ్ న్యూస్
గాంధీభవన్లో అల్లు అర్జున్ మామకి అవమానం
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీతో మాట్లాడడానికి ప్రయత్నం చేసిన చంద్రశేఖర్ రెడ్డి.. దీపా దాస్ మున్షీ పట్టించుకోక పోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయిన అల్లు అర్జున్ మామ.
మీడియా ప్రతినిధులు మాట్లాడించే ప్రయత్నం చేసిన… https://t.co/sjCq3wmQQG pic.twitter.com/k6yBpzwB6Q
— Telugu Scribe (@TeluguScribe) December 23, 2024