Allu Arjun : సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి గారిని బ్రతికించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసారు. కానీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణాలను ఎట్టకేలకు సీపీఆర్ చేసి కాపాడారు. కానీ ఇప్పటి వరకు శ్రీతేజ్ స్పృహలోకి రాలేదు. కిమ్స్ హాస్పిటల్ లో చేర్పించిన కొత్తల్లో శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉండేది. అసలు బ్రతుకుతాడా లేడా అని అందరూ భయపడ్డారు. కానీ డాక్టర్ల కృషి, దేవుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ప్రాణాలు అయితే ఉన్నాయి కానీ, బ్రతికి ఉన్న శవం లాగానే గత రెండు నెలల నుండి హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు. మెలుకవలోకి రెండు మూడు సార్లు వచ్చాడు కానీ, దేనికి కూడా ఆయన స్పందించడం లేదు. ఎవ్వరినీ గుర్తుపట్టలేకపోతున్నాడు పాపం. శరీర భాగాల్లో ఎలాంటి లోపాలు లేవు కానీ, శ్రీతేజ్ నుండి మాత్రం స్పందన లేదు.
ఆహరం కూడా ఆ బిడ్డ నేరుగా తీసుకోవడం లేదు. గత రెండు నెలలుగా గొట్టం ద్వారా లిక్విడ్ రూపం లో ఆహారాన్నిశరీరం లోపలకు పంపిస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి పరిస్థితి లోనే ఉండాలి అని అడిగితే డాక్టర్ల నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. భవిష్యత్తులో అయిన కోలుకుంటాడని నమ్మకం ఇవ్వగలరా అంటే కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. నేడు అల్లు అర్జున్ కంపెనీ లో పని చేసే బన్నీ వాసు కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసాడు. అవసరమైతే శ్రీతేజ్ ని విదేశాల్లో ఉన్నత వైద్యం అందిస్తామని, ఖర్చు మొత్తం తామే భరిస్తామని శ్రీ తేజ్ తండ్రికి భరోసాని అందించాడు బన్నీ వాసు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘తండేల్’ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోవడం పై అల్లు అర్జున్ టీం పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అల్లు అర్జున్ తో కలిపి, పుష్ప 2 మూవీ టీం మొత్తం కలిసి శ్రీతేజ్ కి రెండు కోట్ల రూపాయిల ఆర్ధిక సహాయం అందించారు. అదే విధంగా ప్రభుత్వం మరోపక్క శ్రీతేజ్ కి కిమ్స్ హాస్పిటల్ లో వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆర్ధిక సాయం అందించారు. కానీ శ్రీతేజ్ మళ్ళీ మామూలు మనిషి అయితేనే సహాయం చేసినవాళ్లందరికీ ఆనందం. ఇంతమంది అతన్ని మామూలు మనిషి కావాలని కోరుకుంటున్నారు కానీ, శ్రీతేజ్ లో ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంకెంత కాలం అతను హాస్పిటల్ బెడ్ మీదనే పడుకొని ఉంటాడు?, ఎన్ని రోజులు ఇలా జీవం ఉన్న శవం లాగా బ్రతకాలి. సరదాగా తన తోటి స్నేహితులతో ఆదుకోవాల్సిన వయస్సులో ఆ బిడ్డకి ఇలాంటి పరిస్థితి ఏంటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ బాధపడుతున్నారు.