https://oktelugu.com/

Palakkad : కాంగ్రెస్ సీపీఎం అంతః కలహాల మధ్య బీజేపీకి మెరుగైన అవకాశం

Palakkad: కాంగ్రెస్ సీపీఎం అంతః కలహాల మధ్య బీజేపీకి మెరుగైన అవకాశం పాలక్కడ్ లో ఉండబోతోంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : October 25, 2024 / 07:55 PM IST

    Palakkad : కేరళలో ఒక పార్లమెంట్.. 2 ఉప ఎన్నికల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వయనాడ్ స్థానం ముస్లిం జనాభా అధికంగా ఉండడంతో అక్కడ ఫలితం తేడా వచ్చే అవకాశాలు లేవు. పాలక్కడ్ అసెంబ్లీ స్థానం మాత్రం ఉత్కంఠ రేపుతోంది. గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా షఫీ గెలిచాడు. ఏకంగా బీజేపీ తరుఫున నిలబడ్డ మెట్రో మ్యాన్ శ్రీధర్ పై గెలిచాడు. కేవలం 3 వేల ఓట్ల తేడాతో గెలిచాడు.

    ఈ షఫీని పార్లమెంట్ ఎన్నికల్లో వడక్కర్ పార్లమెంట్ స్థానంలో పోటీచేసి ఎంపీగా గెలిచాడు. దీంతో పాలక్కడ్ అసెంబ్లీకి షఫీ రాజీనామా చేయడంతో సీటు ఖాళీ అయ్యింది.

    పాలక్కడ్ మొత్తం అర్బన్ ఏరియా.. ఒక మున్సిపల్ కార్పొరేషన్, మూడు గ్రామపంచాయితీలు ఉన్న అసెంబ్లీ స్థానం. కోయంబత్తూరుకు సరిహద్దు పాలక్కడ్ ఉంటుంది. పశుసంపద బాగా ఉంటుంది. 82 శాతం అర్బన్ ఏరియా.. 18 శాతం గ్రామీణ ఏరియా.. 74 శాతం హిందువులు, 23 శాతం ముస్లింలు, 3 శాతం క్రిస్టియన్లు , ఎస్సీలు 11 శాతం ఉన్నారు.

    కేరళలో బీజేపీ ఎప్పుడూ లేకపోయినా ఈ పాలక్కడ్ లో ఎప్పుడు దీని ప్రభావం ఉంటుంది. 10 శాతం ఓట్లు బీజేపీకి పడుతూనే వస్తున్నాయి. ప్రస్తుత పాలక్కడ్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ చేతిలోనే ఉండడం విశేషం.

    కాంగ్రెస్ సీపీఎం అంతః కలహాల మధ్య బీజేపీకి మెరుగైన అవకాశం పాలక్కడ్ లో ఉండబోతోంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.